పేక పారాయణం

ఇస్పేట్: భక్తిఙ్నాన వినిర్మూలనం
బ్రహ్మానంద విసర్జనం
ఇహ జీవన వైరుద్యం
ఇస్పేట్ రాజు నమో నమ:
కళావర్: కవికల్మష సంపూర్ణం
సదా కలహకారణం
సాధు సాంగత్యనిర్మూలం
కళావర్ రాణి నమో నమ:
ఆఠీన్: ఆ జన్మ దు:ఖ సంపాద్య
నిద్రా సుఖ వినాశనం
అనాది జన్మ మిత్రత్వం
ఆఠీన్ రాణి నమో నమ:
డైమన్:ఢాకినీ సదృశం రూపం
దయా సత్య వినాశనం
దంఖీ గర్వమదోపేతం
డైమన్ రాజు నమో నమ:

మేరా డాలర్ $ మహాన్

ఆడ మగ పిల్లలందరు అమెరికాకు ఎగబడుతున్న ఈ సమయంలో వృద్ద తల్లిదండ్రుల మనోభావాలు
కంప్యూటర్ ఓ కంప్యూటర్ !
విడిపోతున్న బంధాలతో
వీడియో చాటింగులా ?
మమతతో స్పృశించాల్సిన వేళ్ళకు
మౌస్-కీ బోర్డులా?
కాటుక పెట్టాల్సిన కళ్ళకు
కాంటాక్టు లెన్సులా ?
పెసరట్టు దోశలను వదలి
పిజ్జా, ఫాస్త్ ఫుడ్సా ?
భావోద్వెగంతో నిండాల్సిన గుండెలకు
బ్రౌజింగ్ ఎంక్లేవులా?
ఒడిలో సేద తీరాల్సిన మాకు
ఓల్డేజి హోములా
కంప్యూటర్ ఓ కంప్యూటర్

నేటి కవిత

ట్యూబులైటు వెలుగు తెల్లగనుండు
కలర్ టీవీ చూస్తే హాయిగ నుండు
ఎయిర్ కండీషన్ చల్లగనుండు
గీజర్ నీరు వెచ్చగనుండు
బల్బులు చూడ వెలుగుచునుండు
కరెంటు బిల్లు చూస్తే
కళ్ళు తిరుగుచునుండు

A వ్వనం

Aవ్వనంలో ఉన్నప్పుడు Aవ్వరినీ లెక్కచేయక Aంతో డబ్బు ఖర్చుపెట్టి Aన్నో బ్రతుకులను నాశనం చేసిన అతను Aవ్వనం అయిపోయాక Aంత డబ్బు ఖర్చుపెట్టినా Aఛాక్టరుకూ అర్ధం కాని జబ్బులతో Aల్లప్పుడు దగ్గుతూ Aవ్వరూ సరిగా చూడక Aవన్ బిచ్చగాడయ్యాడు

లేటెస్ట్ సామెతలు

సిమ్రాన్ సినిమా తీస్తే
సావిత్రి సంగీతం కొట్టిందంటా
ఫూలన్ దెవి పున్యాణికి పోతే
వీరప్పన్ మనకెందుకని వారించాడంటా
స్వామివారికే సైకిల్ లేదంటే
పూజారి మోటార్ సైకిల్ కావాలన్నాడంట
తాలింపులోకి పామాయిల్ లేదంటే
ఆయిల్ పుల్లింగ్ కి సంఫ్లవర్ ఆయిల్ కావాలన్నాట్ట
లచ్చలున్నమ్మి మచ్చలున్నా నచ్చుద్ది
కోటి విద్యలు
ఎంప్లాయిమెంట్ కొరకే
జాబు ఉండగానే
జేబు నింపుకోవాలి
బారు పెట్టినవాడు
బీరు పోయకమానడు