టపా తేదీ డిసెంబరు 4, 2006 ద్వారా జ్యోతి
ఆది లోనే హంసపాదు
ఆపదలో ఆదుకున్నవాడే ఆప్తుడు
అతి రహస్యం బట్టాబయలు
ఇంటిగుట్టు లంకకు చేటు
వజ్రాన్ని వజ్రం తోనేకోయాలి
నీరు పల్లమెరుగు, నిజం దేవుడెరుగు
గోరంతదీపం కొండంత వెలుగు
వానరాక, ప్రాణం పోక తెలీదు
ఆరాటమే గానీ పోరాటం లేదు
ఇంటి దొంగ ను ఈశ్వరుడైనా పట్టలేడు
ఎవరిపిచ్చి వారికి ఆనందం
ఉంటే ఉగాది లేకుంటే శివరాత్రి
అదృష్టం అందమేక్కిస్తె బుద్ది బురదలోకి లాక్కెళ్ళింది
తన కోపమే తన శత్రువు
దేవుడు వరమిచ్చినా పూజారి వరమివ్వనట్టు
ఏరు ఎన్ని వంకలు పోయినా సముద్రం లోనే పడ్డట్టు
ధైర్యం లేని రాజు, యోచన లేని మంత్రి
సంసారం గుట్టు వ్యాధి [...]
: నందు ఉంచబడ్డది; పాటలు, సరదా సరదా | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ డిసెంబరు 4, 2006 ద్వారా జ్యోతి
పంచాక్షరి మహామంత్రం ఓం నమశ్శివాయ
పంచభూతములు భూమి,నీరు,కాంతి,గాలి,ఆకాశం
పంచప్రాణములు ప్రాణము,ఆపానము,వ్యనము,ఉదానము,సమానము
పంచామృతములు పాలు,నీరు,పెరుగు,నెయ్యి,తేనె
పంచలోహాలు బంగారం, వెండి, ఇత్తడి, కంచు, ఇనుము
పంచమహాపాతకములు స్వర్ణస్తేయము (బంగారం దొంగిలించుట)
సురాపానం, బ్రహ్మహత్య,గురుపత్నీగమనము, మహాపాతకసావాసము.
పంచపాండవులు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు.
సస్యపంచకము వరి, నువ్వులు, పెసలు, యవలు, తెల్ల ఆవాలు
పంచమహాకావ్యములు తెలుగులో- మనుచరిత్ర, వసుచరిత్ర, రాఘవపాండవీయము, శృంగారనైషధము/ఆముక్తమాల్యద, పాండురంగమాహాత్యం
పంచమహాకావ్యములు సంస్కృతములో - రఘువంశము, కుమారసంభవము, శిశుపాలవధ, కిరాతార్జునీయము, మేఘసందేశం
పంచాంగుళీయములు అంగుష్టము(బొటనవేలు),తర్జని(చూపుడువేలు)శని అంగుళి(మధ్యమ), అనామిక (ఉంగరం వేలు), కనిష్ట(చిటికెనవేలు).
పంచదేవతలు సూర్యుడు, అంబిక, విష్ణువు, గణపతి, ఈశ్వరుడు. వీరినే పంచాయతనమందురు.
పంచ్జానేంద్రియాలు [...]
: నందు ఉంచబడ్డది; general | 1 అభిప్రాయం »