ఔరా హారములిన్ని రకమ్ముల్లా?
టపా తేదీ డిసెంబరు 18, 2006 ద్వారా జ్యోతి
అగ్రహారము……….రాజులిస్తే కవి పండితులను రంజింపజేసేది.
ఆహారము…………ప్రాణి కోటికి సంతృప్తి నిచ్చేది.
చంద్రహరము……. అతివల అందాన్ని ఇనుమడింపజేసేది
నీహారము………….మంచు ముత్యాలతో వనదేవతను అలంకరించేది.
ఫలహారము……….చుట్టాలను సంతోషపెట్టేది
బేహారము………….వ్యాపారస్తులకిష్టమైనది.
భాగాహారము……..బడి పిల్లలకు లెక్కల మాస్టరిచ్చేది.
మణిహారము………భార్యామణికి బహు సంబరాన్నిచ్చేది
మానవహారము…..దేశమాతకు శాంతి సౌభాగ్యాలను సమకూర్చేది.
ముత్యాలహారము..మహారాణులకు మురిపాన్ని కలిగించేది
రత్నాలహారం……. యువరాణులకు ఠీవిని కలిగించేది
విహారము………….క్రొత్తదంపతులకు హనీమూన్ యాత్రలో మహాదానందాన్ని కలిగించేది
వ్యవహారము……..తగవులాడుకోకుండా చిన్నవాళ్ళకు పెద్దవాళ్ళు సర్దుబాటు చేసి ఇచ్చేది.
: నందు ఉంచబడ్డది; సరదా సరదా

మీరు ఇంకేమైనా హారాలు మరచి పోయారేమోనని వెతికితే ఈ “ప్రహారం” దొరికింది. జత చేయండి మరి.
ప్రసాదం
http://prasadm.wordpress.com/
మీ నగల్లో ఇంకొన్ని హారాలు జత చేయండి - సంహారం
మితాహారం,
mii aksharaala haaram caala bagundi.