టపా తేదీ జనవరి 9, 2007 ద్వారా జ్యోతి
ఓ ఆఫీసులో యాజమాన్యం లోన్లు ఇవ్వడంతో స్టాఫ్ మెంబర్స్ అందరూ కొత్త కొత్త వాహనాలు తీసుకున్నారు. పార్టీ చేసుకున్నారు. అయితే మిస్టర్ నిరాశాపతి తన తోటి మిత్రులు ఇచ్చిన వాటితో తృప్తి చెందలేదు. కారణాలు ఈ క్రింది విధంగా తెలియజేస్తున్నాడు. ( మందు పార్టీ లేదని అసలు బాధ )
సతీషు :
తీసుకున్న వాహనం హోండా
తినిపించింది మాత్రం బోండా
రమేష్ :
తీసుకున్న వాహనం నోవా
తినిపించింది కేవలం కోవా
రాకేష్ :
తీసుకున్న వాహనం స్కూటీ
త్రాగించింది మాత్రం ఫ్రూటీ
రాజేష్ :
తీసుకున్న వాహనం విక్టర్
తినిపించింది కాసింత [...]
: నందు ఉంచబడ్డది; Funny | 2 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జనవరి 9, 2007 ద్వారా జ్యోతి
కొత్తగా పెళ్ళయినట్టు గుర్తుగా
చేతిలోని ఆ సంచి
పాపం నడుస్తాడు తలవంచి
భార్యకిష్టమైన కాయగూరలు తెస్తాడు ఎంచి
ఆవిడ మాట జవదాటడు ఒక్క ఇంచి
ఆమెగారు చెప్పిందల్లా చేస్తాడు మనసు వుంచి
బట్టలు ఉతుకుతాడు గట్టిగా దంచి
ఆరేస్తాడు నీళ్ళలో ముంచి
మధ్య మధ్య ప్రేమను నంచి
ఆవిడ చేత తినిపిస్తాడు లంచి
సమయాన్నంతా శ్రీమతికే పంచి
కోరితే తీసుకువెళ్తాడు కంచి
పాత స్నేహాలని తటాలున తుంచి
అవసరమైతే బంధుత్వాలను తెంచి
ఏకంగా లోకాన్నే విస్మరించి
అస్తమానం ఆలినే స్మరించి
ఆవిణ్ణి చేసుకుంటాడు మంచి
ఇదే వరస పెళ్ళయిన దగ్గర నుంచి
ఇంకా చెప్పలేను ఇంతకన్నా వివరించి
: నందు ఉంచబడ్డది; Funny | 2 వ్యాఖ్యానాలు »