సెల్ ఫోన్ వ్రతం

 అందరికీ సంక్రాంతి శుభాంక్షలు. సంక్రాంతికి మాకు నోము లేదు. కొత్త సెల్ ఫోన్
నొకియా 6030 తెలుగుది తీసుకున్నా. అందుకే ఈ వ్రతం చేసుకుంటున్నా.
వాయనం మాత్రం మావారికి ఇచ్చి మళ్ళీ నేనే లాగేసుకుంటాలెండి.
కొనిచ్చింది ఆయనే.
                                    
సెల్ ఫొన్ వ్రత కల్ప విధానo
సంకల్పం చెప్పుకుని ఇలా పూజ చేయాలి.
ఒం సెల్లాయనమహ
రింగ్ టోన్ ఘల్లాయనమహ
సెల్లుంటే త్రిల్లాయనమహ
బిల్లు చూస్తే ఝల్లాయనమహ
అది కట్టేసరికి జేబుకు చిల్లాయనమహ.
సంకల్పం ఐన తర్వాత మీకు నచ్చిన వారితో కనీసం గంట సేపు
 సెల్లులో మాట్లాడవలెను.
వ్రత కథ;
పూర్వం ‘సెల్ వాలా’ అనువాడు [...]

సంక్రాంతి రహస్యాలు

                                     సంక్రాంతి వచ్చెనమ్మ సరదాల సంక్రాంతి
                                     సంతోషమిచ్చెనమ్మ జగతిలో కొత్త కాంతి 

తెల్లారేసరికి నేలనిండుగా ముగ్గులు ప్రతిరోజూ కనిపిస్తున్నాయంటే ‘పెద్ద పండుగ ‘
వస్తుందన్నమాటే. నిద్ర లేస్తున్నవేళ హరినామ కీర్లన హరిదాసు కంఠం
 వినిపిస్తుందంటే ‘ మకరసంక్రమణ పర్వదినం ‘ దగ్గర్లో ఉందన్నమాటే.
రాళ్ళూ రప్పలూ లేకుండా పేడతో ఓ పద్దతిలో  అలకబడిన నేల, మేఘాలు
లేకుండా స్వచ్చంగా ఉన్న ఆకాశానికి సంకేతం. ఓ చక్కని పద్ధతిలో పెట్టబడిన
చుక్కలు ఆకాశంలో రాత్రివేళ కనిపించే నక్షత్రాలకి సంకేతం.ఈ చుక్కల చుట్టూ
 తిరుగుతూ చుక్కలను భద్రంగా గళ్ళలో ఇమిడ్చిన [...]