సెల్ ఫోన్ వ్రతం
అందరికీ సంక్రాంతి శుభాంక్షలు. సంక్రాంతికి మాకు నోము లేదు. కొత్త సెల్ ఫోన్
నొకియా 6030 తెలుగుది తీసుకున్నా. అందుకే ఈ వ్రతం చేసుకుంటున్నా.
వాయనం మాత్రం మావారికి ఇచ్చి మళ్ళీ నేనే లాగేసుకుంటాలెండి.
కొనిచ్చింది ఆయనే.
సెల్ ఫొన్ వ్రత కల్ప విధానo
సంకల్పం చెప్పుకుని ఇలా పూజ చేయాలి.
ఒం సెల్లాయనమహ
రింగ్ టోన్ ఘల్లాయనమహ
సెల్లుంటే త్రిల్లాయనమహ
బిల్లు చూస్తే ఝల్లాయనమహ
అది కట్టేసరికి జేబుకు చిల్లాయనమహ.
సంకల్పం ఐన తర్వాత మీకు నచ్చిన వారితో కనీసం గంట సేపు
సెల్లులో మాట్లాడవలెను.
వ్రత కథ;
పూర్వం ‘సెల్ వాలా’ అనువాడు శ్రీ మహావిస్ణువును గూర్చి తపస్సు చేయగా
విస్ణువు ప్రత్యక్షమై ఎదైనా వరం కోరుకోమని చెప్పెను. అప్పుదు సెల్ వాలా
తనకు విస్ణువు హృదయ పీఠంపై స్థానం కోరెను. అందుకు విస్ణుమూర్తి ఆ
స్థానం లక్ష్మీదేవికి కొలువై ఉన్నది కావున అందుకు బదులుగా మరొక వరం
కోరుకోమనెను. అప్పుడు సెల్ వాలా తనకు నారయణునిపై స్థానం లేకున్నచో
కనీసం నరుని హృదయ పీఠంపై స్థానం సంపాదించే వరమీయమని కోరెను.
అప్పుడు విస్ణువు ‘కలియుగంలో నరుడు తన అపార మేధోసంపత్తితో ఒక
మాట్లాడు యంత్రము కనుగొని దానికి సెల్ ఫోన్ అన్న పేరును నామకరణము
చేసి సదా తన జేబులో ఉంచుకొనుట చేత నరుని హృదయ పీఠంపై నీకు
స్థానం లభించు ‘నని వరం ఇచ్చెను. ఆ వర ప్రభావం చేతనే మనం సెల్ ఫోన్ ను
జేబులలో ఉంచుకొనుచున్నాము. లేదా మెడలో హారంలా ధరిస్తున్నాము.
ఈ కథ విన్నవారికి సకల శుభములు చేకూరి సెల్ లేని వారికి కొత సెల్లు,
ఉన్నవారికి మరొక సెల్లు ప్రాప్తించును.
చివరగా కొత్త సెల్లును ఒక వెండి పళ్ళెంలో నుంచి భక్తితో హారతి వెలిగించి
దానికి శక్తి కొలదీ రీచార్జి కూపన్లను నైవేద్యముగా సమర్పించి ఆ సెల్లును
వచ్చిన వారికి వాయనమిచ్చినచో సకల ఐశ్వర్యములు సిద్దించును.
: నందు ఉంచబడ్డది; Funny


mii intiki pearantaaniki neanostaanu.naaku ivvandi vaayanam.lol
mii post adirindi kadaa…emi cepparandi vrata kadha.
నొకియా 6030 “తెలుగుది” అంటే ఏమిటి? అట్టి వివరంబులు తెలుపగలరు.
సంక్రాంతికి నవ్వులు పూయించినందుకు కృతజ్ఞతలు. మీ వ్రత కథ బాగున్నా సంకల్పం అదిరిందండీ! కట్టె, కొట్టె, తెచ్చె అన్నట్టు సెల్లు భాగోతాన్నంతా మూడు ముక్కల్లో చెప్పారు. మంచి రచయిత్రి కాగలరు!
ఇప్పుడు నోకియా వాళ్ళు 6030 మోడల్ తెలుగులో సందేశాలు పంపగలిగె విధంగా తయారు చేసారు.
hi akka,
cell phone vratha kalpa vidhanam chaala bagundi…..nenu eppude chadavadam modhalu pettanu…….ika nunchi anni chaduvutha