అలా అంటే ఇలా
అసలుకన్నా కొసరు ఎక్కువ..
* తిరుపతిలో దేవుడి దర్శనానికి గంటసేపు నిలబడితే, ప్రసాదం కోసం క్యూలో నాలుగు గంటలు నిలబడడం.
ఎవరు త్రవ్విన గోతిలో వారే పడటం..
* లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించి మళ్ళీ అదే లంచం తీసుకోబోయే ముందు పట్టుబడటం.
పుండు మీద కారం జల్లడం..
* సంవత్సరమంతా నానా తంటాలు పడి చదివినా వేసవి సెలవుల్లో ఆ కోచింగని ఈ కోచింగని బలవంతపెట్టడం.
నారు పోసినవాడే నీరు పొయ్యడం..
* సినిమాను తీసిన నిర్మాతే సినిమాను నడిపించడం.
కొండ నాల్లుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడడం.
* బోగస్ ఓట్లు సమూలంగా ఏరి వేద్దాం అని అనుకుంటే, అర్హులయిన వారి పేర్లు ఓటర్ల జాబితాల నుంచి గల్లంతు కావడం.
పేరు గొప్ప ఊరు దిబ్బ..
* కలర్ ఫుల్ గా ఉండే “పింక్ కార్డు” లకు ఏమీ ఇవ్వరుకానీ వెల వెల బోయే తెల్ల కార్డులక సరుకులన్నీ ఇవ్వడం..
పులిని చూసి నక్క వాతలు పెట్టుకోవడం..
* స్టెత స్కోపు మెడలో వేసుకుని తిరిగే డాక్టరుని అనుకరిస్తూ కాంపౌండరు ధర్మామీటరుకి దారాన్ని కట్టి మెడలో వేసుకు తిరగడం.
: నందు ఉంచబడ్డది; సరదా సరదా

మీ బ్లాగు నవ్వుల పువ్వులు పూయిస్తుంది