ఊరికో సందడి
టపా తేదీ జనవరి 29, 2007 ద్వారా జ్యోతి
భయపెట్టే ఊరు - పిడుగురాళ్ళ
మరెక్కడా శాఖలు లేవు - విశాఖ
కోతులు లేని ఊరు - బందరు
ఆదరాబాదరా ఎక్కువే - హైదరాబాదు
విజయమేగాని వాడ కాదు - విజయవాడ
వెనుకబడ్డ వారని వేలాకోళమా - శ్రీకాకుళం
మంచి పేరే పాపం మార్చుకుంది - మద్రాసు
తణుకుబెణుకు ఉండదు - తణుకు
మనం మనం ఎప్పటికి - బరంపురం
కమలాలు ఉచితం కాదు - కమలాపురం
అమృతం దొరకదు - అమృతాపురం
చీపురు కాదు పల్లి కాదు - చీపురుపల్లి
ఆలి దొరకదు - తెనాలి
కరీము ఇక్కడ ఉండడు - కరీం నగర్
: నందు ఉంచబడ్డది; general

‘ఆలి దొరకదు - తెనాలి.’ నా, నా మిత్రుడి ఇద్దరి భార్యలూ తెనాలి వారే.
‘తణుకు బెణుకు ఉండదు - తణుకు.’ తళుకుమనే అమ్మాయిలకు లోటే లేదు తణుకులో.
‘కరీము ఇక్కడ ఉండడు - కరీం నగర్.’ కరీం బీడీలు ఇష్టంగా తాగుతారు ఇక్కడ.