టపా తేదీ జనవరి 29, 2007 ద్వారా జ్యోతి
అసలుకన్నా కొసరు ఎక్కువ..
* తిరుపతిలో దేవుడి దర్శనానికి గంటసేపు నిలబడితే, ప్రసాదం కోసం క్యూలో నాలుగు గంటలు నిలబడడం.
ఎవరు త్రవ్విన గోతిలో వారే పడటం..
* లంచం ఇచ్చి ఉద్యోగం సంపాదించి మళ్ళీ అదే లంచం తీసుకోబోయే ముందు పట్టుబడటం.
పుండు మీద కారం జల్లడం..
* సంవత్సరమంతా నానా తంటాలు పడి చదివినా వేసవి సెలవుల్లో ఆ కోచింగని ఈ కోచింగని బలవంతపెట్టడం.
నారు పోసినవాడే నీరు పొయ్యడం..
* సినిమాను తీసిన నిర్మాతే సినిమాను నడిపించడం.
కొండ నాల్లుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడడం.
* [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 1 అభిప్రాయం »
టపా తేదీ జనవరి 29, 2007 ద్వారా జ్యోతి
* హీరో మారువేషం వేసి విలన్ ని ఆటపట్టిస్తాడు. అదే విలన్ మారువేషం వేస్తే ఇట్టే దొరికిపోతాడు.
* పిస్టల్లో ఆరు బుల్లెట్స్ ఉంటాయన్న సంగతి ప్రేక్షకుడికి తెలియదనుకొనిహీరో తెగ కాల్చేస్తుంటాడు.
* పేద హీరోయిన్ మేకప్పులో మాత్రం తక్కువ కాకుండా చూసుకుంటుంది.
* చదువురాని హీరో దేశాలు దాటి వెళ్ళిపోతాడు.వీసాలు,లాంగ్వేజు,డబ్బు ఇతనికి అవసరం లేదు ఎవరూ అడగరూ.
* విలన్ వంట్లోకి కత్తి దిగితే ఒక్కసారి చస్తాడు. అదే హీరో అయితే కత్తి వంట్లో ఎన్ని మెలికలు తిరిగినా డైలాగ్స్ అన్ని చెప్పేసి [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 1 అభిప్రాయం »
టపా తేదీ జనవరి 29, 2007 ద్వారా జ్యోతి
మగవారికి…
* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ ATM కార్డ్ ని స్లాట్లో ఇన్సర్ట్ చేయండి.
* మీ పిన్ నంబరుని ఎంటర్ చేయండి.
* మీ డబ్బు, కార్డు,రసీదు తీసుకుని వెళ్ళిపోండి.
ఆడవారికి…
* ATM కేబిన్ ముందు ఆగండి.
* మీ కారు రియర్ మిర్రర్లో మీ మేకప్ సరిదిద్దుకోండి.
* కారు ఇంజన్ ఆఫ్ చేయండి.
* కారు కీస్ మీ హేండుబేగులో పెట్టుకోండి.
* కారులో వేడిగా లేక చల్లగా ఉన్నందుకు కాసేపు రిలాక్సవండి.
* మీ ATM కార్డ్ కోసం హేండుబేగ్ అరలన్నీ [...]
: నందు ఉంచబడ్డది; general | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జనవరి 29, 2007 ద్వారా జ్యోతి
నూటి నూరు పాళ్ళు కాకున్నా ఏ కొందరి ఊహల్లోనైనా ఇలా ఉండక పోతుందా అనే ఊహలోనే ఈ చిలిపి అల్లరి.
ప్రియురాలివైతే
నీ సమక్షంలో
యుగమైనా ఒక్క క్షణం
అదే నువ్వు పెళ్ళామైతే
క్షణమే అయినా
అది ఒక మహాయుగం.
ప్రియురాలివైతే
నీ మాటలు
అమృతపు ఊటలు
అదే పెళ్ళానివైతే
ఆ మాటలు కావా
చెవుల్లో సీసపు పోతలు.
ప్రియురాలివైతే
మునిగితేలేది
కలల్లో..ఊహల్లో
అదే నువ్వు పెళ్ళానివైతే
ఆ మునకలే
కష్టాల్లో నష్టాల్లో
ప్రియురాలివైతే
మాట జారితే
ఎమంటావోనని భయం
అదే నువ్వు పెళ్ళానివైతే
ఏ మాట జారినా
పడి ఉండక చస్తానా ఏం?
: నందు ఉంచబడ్డది; Funny | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జనవరి 29, 2007 ద్వారా జ్యోతి
భయపెట్టే ఊరు - పిడుగురాళ్ళ
మరెక్కడా శాఖలు లేవు - విశాఖ
కోతులు లేని ఊరు - బందరు
ఆదరాబాదరా ఎక్కువే - హైదరాబాదు
విజయమేగాని వాడ కాదు - విజయవాడ
వెనుకబడ్డ వారని వేలాకోళమా - శ్రీకాకుళం
మంచి పేరే పాపం మార్చుకుంది - మద్రాసు
తణుకుబెణుకు ఉండదు - తణుకు
మనం మనం ఎప్పటికి - బరంపురం
కమలాలు ఉచితం కాదు - కమలాపురం
అమృతం దొరకదు - అమృతాపురం
చీపురు కాదు పల్లి కాదు - చీపురుపల్లి
ఆలి దొరకదు - తెనాలి
కరీము ఇక్కడ ఉండడు - కరీం నగర్
: నందు ఉంచబడ్డది; general | 1 అభిప్రాయం »