ఆడపిల్ల
పేగు తెంచుకుని నేలపై పడినప్పుడు
ఆ ఆడపిల్ల అమృత కలశంగా కాలేదు
అగ్నికుంపటి కాలేదు. అయినా
కన్నవారి కనుకొలకుల నుండి
వర్షించిన భాష్పాలిందుకు సాక్షమిచ్చాయి!
గోరుముద్దలు తినిపించి లాలించే అమ్మ
అత్తారింటికి సాగనంపే క్షణాన…
గోడున ఏడవకుండా ఉంటుందా?
ఈడొచ్చిందని వెళ్ళిపోయే
రోజొచ్చిందని అందరికి తెలిసాకా
పదిలంగా చూసుకునే వరుడి కోసం
కాళ్ళకు బలపం కట్టుకుని
తిరిగేది నాన్న కాదా?
పరాయిదైపోయినా తన బిడ్డకోసం
కడదాకా అమ్మపడే
ఆ తపనను అక్షరాల్లో వర్ణించగలనా?
నేనూ తనలా కాగలనా?
అత్తింటికెళ్ళినా, పుట్టింటిపై మమకారం
వదలలేని ఆ ఆడపిల్ల అనుబంధానికి
అనురాగానికి అర్ధం చెప్పగలమా?
ఆడపిల్లకి పెళ్ళయ్యాక కూడా
పుట్టిల్లు, మెట్టిల్లు
రెండూ కావాలి, అందరిని ప్రేమగా
చూసుకునేది ఆడపిల్లే కదా?
: నందు ఉంచబడ్డది; general | 12 వ్యాఖ్యానాలు »
