పెళ్ళీ పెళ్ళి పెళ్ళి…………
పెళ్ళి అంటే హోటల్‌కి వెళ్ళి ఆర్డర్ చేస్తె అది వేరేవాడి ప్లేటులో కనపడడం.
———————————————————–
రాము: డాక్టరుగారు, ఎక్కువకాలం జీవించాలంటే ఏం చేయాలి?
డాక్: సింపుల్,పెళ్ళీ చేసుకో.
రాము: ఈ ఐడియా పని చేస్తుందా?
డాక్: లేదు, కాని చిరకాలం జీవించాలనే కోరిక కలగదు.
————————————————————
వధూవరులు పెళ్ళిలో చేతులెందుకు కలుపుతారు?
ఏమిలేదు.బాక్సింగులోలాగా జరగబోయే యుద్ధానికి ఆరంభ సూచనగా పరిచయం చేసుకోవడం.
————————————————————-
భార్య: డార్లింగ్ ఇవాళ మన పెళ్ళీరోజు కదా ఏం చేద్దాం?
భర్త: రెండు నిమిషాలు మౌనం పాటిద్దాము.
————————————————————
ప్రేమ పెళ్ళా పెద్దలు కుదిర్చిందా ఏది మంచిది అని చర్చించేవాళ్ళను చూస్తే వింతగా ఉంటుంది.
ఆత్మహత్యా లేక హత్యా ఏది మంచిది అన్నట్టు.
————————————————————
ఈ దేవుడిని అర్ధం చేసుకోవడం చాలా కష్టం బాబు. అందమైన ఆడవాళ్ళను సృష్టిస్తాడు. కాని వాళ్ళను భార్యలుగా చేస్తాడు.
————————————————————-
అమ్మాయిలు చాక్లెట్స్‌లాంటి వాళ్ళు.ఎప్పుడైనా తినొచ్చు బావుంటాయి.
ప్రేమికులు మిరపకాయ బజ్జీలాంటి వాళ్ళు ,అప్పుడప్పుడు స్పెషల్‌గా తినడానికి బావుంటాయి.
భర్తలు పప్పన్నం లాంటివాళ్ళు .ఎది దొరక్కపోతే తినడానికి.
————————————————————–
ఒక భర్తకు టెలిగ్రాం వచ్చింది. భార్య చనిపోయింది. దహనం చేయాలా, పూడ్చిపెట్టాలా? అని
భర్త: రిస్క్ వద్దు శవాన్ని దహనం చేసి, బూడిదను పూడ్చిపెట్టండి.
—————————————————————
మన చట్టం రెండో పెళ్ళికి ఎందుకు అనుమతించదు?
ఎందుకంటే చట్టప్రకారం ఒకే తప్పుకు రెండుసార్లు శిక్ష వేయలేరు కాబట్టి.
————————————————————–
: నందు ఉంచబడ్డది; Funny


రాము/డాక్ జోకు బాగా నచ్చింది.మన ‘రానారె’ను రాముగా నేను ‘డాక్’గా ఊహించుకొంటే ఇంకా మజాగా ఉంటుంది
హ్హ!హ్హ!హ్హా! జోకులు బాగున్నాయి. కాని, ఏమిటి? ఈసారి పెళ్ళి మీద దాడి చేసారు.
హతోస్మి! బెదిరించకండి సార్!! :))