ఆలిచేసిన ఆరు ఆలోచనలు

నన్ను క్షమించండి. ఇది నా ఐడియా కాదు.ఎవరో విదేశీ మహిళ తన భర్త బాధలు పడలేక ఈ ఐడియాలు ఆలోచించిందని ఎవరో అంటే మీకు చెప్తున్నా.ఇందులో నా దురుద్దేశమేమీ లేదు.సరదాగా నవ్వుకోండి.

స్త్రీ

ఆడదానిగా పుట్టడం ఒక వరం.ఇది నా అభిప్రాయం.మళ్ళీ జన్మలో కూడా నేను స్త్రీలా పుట్టాలనే కోరుకుంటాను. నేను చెప్పేది ఒక సగటు భారతీయ స్త్రీ అనుభవాలు.ఎక్కువాగా నావే అనుకోండి.నా చుట్టూ ప్రపంచంలో నేను చూసిన అనుభవాలు.
మగవాళ్ళు పెళ్ళి కాకముందు ఏ బాదరబందీ,ఆంక్షలు
లేకుండా పెరుగుతారు,తిరుగుతారు.అందుకే పెళ్ళి కాగానే
 తమ స్వాతంత్ర్యము కోల్పోయామని ఫీలవుతారు.కాని
ఆడపిల్లలకు అసలు స్వాతంత్ర్యము ఉండదు.ఇవాళ కొత్త
 తరంలో  మార్పు ఉంది.పెళ్ళి  కాక ముందు తల్లితండ్రులు,
పెళ్ళి అయ్యాక భర్త,వృదాప్యంలో పిల్లలు చెప్పినట్టు ఉండాల్సి
 వస్తుంది.ఐనా వాళ్ళు అది సంతోషంగా నిర్వహిస్తారు.పెళ్ళి
 అనేది ఇద్దరినీ [...]

ఆంధ్రా ఇస్ఫెషల్

ముద్దబంతి పూవులో  పాటకు కాస్త సరదా అనుకరణ…..
  ………………………………………….. 
ముద్దపప్పు కూరలో ములక్కాడ పులుసులో
తెలుగువారి టేస్టులు ఎందరికీ తెలుసులే..? 11ముద్ద11
మిరపకాయలో కారం దాగుందని తెలుసును
గోంగూరను జోడిస్తే ఎమౌనో తెలుసునా..?ఆ..
చూసినా రుచి చూసినా కన్నీళ్ళూ వస్తాయి..
ఏ కన్నీటి వెనకాల ఏకారముందో తెలుసునా…? 11ముద్ద11
‘రసం ‘ అరవదే కాని ఘాటున్నది దానికి
లంకణాలు చేసిన మనిషికే తెలుస్తుందా రుచి
వడియాలను జత చేసి పదిలంగా తీసుకో
తిన్నాక హాయిగా కమ్మగా నిదురపో… 11ముద్ద11
ఆవకాయ మాగాయలే ఆంధ్రులకు రక్ష
సున్నుండలు జంతికలు శ్రీరామరక్ష
తిన్నోళ్ళు తిననోళ్ళు తీపి తీపి గురుతులు
నీరులొలికే [...]

శుభాకాంక్షలు

బ్లాగరుల పోటీలో నామినేట్ చేయబడిన మన తెలుగు బ్లాగరులందరికి
శుభాకాంక్షలు.ఇందులో ఎవరు గెలవకుండా అందరికీ కలిపి బహుమతి
 పంచేస్తే బావుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వీరందరు బ్లాగుల
 పరంగా మహారథులే.ఎవరూ ఎక్కువ కాదు ఎవరూ తక్కువ కాదు.
అందరూ సమానమే. ఈ శుభసంధర్భంలో వీరందరికి తియ్యని తాయిలం …………
            

ప్రయత్నించి చూడండి.

 
మీ కుడికాలు మీ మాట వింటుందా? ప్రయత్నించి చూడండి.
ఇలా చేసి చూడండి.మీ బుర్ర తిరిగిపోతుంది.విఫలులైనా అలా అలా ప్రయత్నిష్తూనే ఉంటారు.ఇది నిజం.
1.మీరు టేబుల్ మీద పని చేసుకుంటున్నారు కదా.మీ కుడికాలు కాస్త
  పైకి లేపి కుడి వైపుగా గుండ్రంగా తిప్పండి.
2.అలా చేస్తూనే కుడి చేత్తో గాలిలో 6 అంకెను గీయండి.ఇప్పుడు మీ     
  కుడికాలు ఎలా తిరుగుతుంది.గమనించండి.
3.మళ్ళీ ప్రయత్నించండి…
 
4.సరిగ్గా వచ్చిందా….