వసంతాగమ శుభవేళ

ఉగాది అంటే యుగ+ఆది …అంటే యుగాదికి ఆది అయిన రోజు అని అర్ధం. బ్రహ్మదేవుడు చైత్ర

శుద్ధ పాడ్యమినాడు ఈ సృష్టిని ఆరంభించడం వల్ల ఉగాది అయ్యింది. పద్నాలుగేళ్ళ వనవాసం

పూర్తిచేసుకున్న రాముడు సీతాదేవితో కలిసి తిరిగి అయోధ్యలో అడుగుపెట్టిన శుభదినం కూడా

 ఇదే. ద్వాపర యుగాన శ్రీకృష్ణుడు తన అవతారాన్ని చాలించిన రోజు కూడా ఈ చైత్ర శుద్ధ

పాడ్యమినాడే అని పురాణాలు చెబుతున్నాయి. ఇన్ని శుభాలు చోటు చేసుకున్న ఈ శుభ

దినాన్ని ’చైత్ర శుద్ధ ప్రతిపద” [...]

త్రిదోషహరమైన ఉగాది పచ్చడి

  
                                           

ఆయుర్వేద వైద్య శాస్త్రం ప్రకారం వాతం , పిత్తం, కఫం అనే త్రిదోషాలు సమస్తితిలో ఉన్నప్పుడే
మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. ఈ మూడు దోషాలు ప్రకోపించకుండా తెలుగువారి నూతన
సంవత్సర ఉగాది పచ్చడి కాపాడుతుంది. శరీరంలోని ప్రతి జీవకణాన్ని ఉత్తేజపరుస్తుంది.
ఈ పండగలోని గమనించదగిన విశేషం ఏమిటంటే ఉగాది పచ్చడి తయారీకి హానికర కృత్రిమ
రసాయనిక పదార్థాలు సరుకులు అవసరం లేదు.
 
 
చింతపండు
 
చింతపండులో కాల్షియం, భాస్వరం, ఇనుము, కెరోటిన్, రిబోఫ్లెవిన్, నియాసిన్, విటమిన్ సి
పుష్కలంగా ఉన్నాయి. దీనిలో [...]

మేషం

 ( అశ్వని, భరణి, కృత్తిక, మొదటి పాదం )
 
ఆదాయం-11, వ్యయం-14, రాజపూజ్యం-3, అవమానం-6
 
 
మేషరాశి వారికి శుభప్రదుడైన గురువు ఉగాది నుంచి అక్టోబరు 27వరకు ఎనిమిదింట
రజిత మూర్తి. తదుపరి సంవత్సరమంతా తొమ్మిదింట లోహమూర్తి. జులై 15 వరకు శని
నాలుగింట రజిత మూర్తి. తదుపరి సంవత్సరమంతా ఐదింట లోహమూర్తి. ఈ ఏడాది
అంతా రాహువు పదకొండింట, కేతువు ఐదింటా సువర్ణమూర్తులు. ఈ రాశివారికి ఈ
ఏడాది గురువు, శని, రాహు కేతువుల సంచార ఫలితంగా సెప్టెంబరు తరువాత [...]

వృషభం

   (కృత్తిక, 2,3,4 రోహిణి, మృగశిర 1,2 పాదాలు)
 
అదాయం-5 వ్యయం-8 రాజపూజ్యం-6 అవమానం-6
 
 
ఈ రాశివారికి ఉగాది నుంచి గురుడు ఏడింట లోహమూర్తి తదుపరి వత్సరమంతా
ఎనిమిదింట సువర్ణమూర్తి జులై 15 వరకు శని మూడింట లోహమూర్తి. మిగిలిన
నెలలన్నీ నాలుగింట సువర్ణమూర్తి. ఈ వత్సరమంతా రాహువు పదింట. కేతువు
నాలుగింట రజితమూర్తులు. వృషభ రాశివారికి ఈ సంవత్సరం మొదటి ఆరు మాసాలు
మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. నవంబరు 7 నుంచి అష్టమ గురుడు కష్టాలను
కలిగించే వాడే [...]

మిధునం

(  మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు)
 
ఆదాయం-11 వ్యయం-5 రాజపూజ్యం-2 అవమానం-2

ఈ రాశివారికి గురుడు అక్టోబరు 27 వరకు ఆరింట, తదుపరి ఏడింట, వత్సరమంతయు
తామ్రమూర్తి. శని జులై 15వరకు రెండింట తామ్రమూర్తి. తదుపరి వత్సరమంతయు
మూడింట రజితమూర్తి. ఏడాది అంతా రాహువు తొమ్మిదింట, కేతువు మూడింట 
సువర్ణమూర్తులు.. సర్వజిత్ నామ సంవత్సరమంతా ఈ రాశివారికి శుభాశుభ
మిశ్రమములు కనిపిస్తాయి. ఏలిననాటి శని బాధ తొలగి పోవడంతో ఆరోగ్యం మెరుగుపడి
ఉల్లాసంగా ఉంటారు. గురు సంచార [...]