టపా తేదీ మార్చి 1, 2007 ద్వారా జ్యోతి
పసితనాన పదిలంగా దాచుకున్న
మధురమైన జ్ఞాపకాలను
మనసు పేజీల మధ్య
ఎద గదుల ఇరుకుల్లో
ఒదిగిపోయిన అనుభూతులను
ఆప్యాయతలను
మననం చేసుకు మురిసినట్టుగా
కనులకున్న మనసుతో
మనసుకున్న కనులతో
మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని
మగతగా వల్లించుకుంటున్నా
పందిరినిండా పరచుకున్న పారిజాతాళ్లా
మనసంతా అల్లుకున్న మాలతీలతల్లా
కనులకు సోకీ సోకని రీతిలో
కురుస్తున్న వెన్నెల వెలుగులు
జిలుగు జిలుగులుగా జగమంతా నిండితే
ఈ సుందరమైన ప్రకృతిలో
అమితానందాంబుధిలో
నువ్వు కళ్ళెదుట వున్నట్టే భ్రమ
నీ అనురాగపూరితమైన తలపు
కలిగిస్తోంది నాలో ఎన్నో అనుభూతుల్ని.
: నందు ఉంచబడ్డది; the fantastic | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ మార్చి 1, 2007 ద్వారా జ్యోతి
. . . . . . . . . . . . . . . . . . . . . . . . దేవులపల్లి కృష్ణశాస్త్రి , నండూరి సుబ్బారావు . . . . . . . . . . . . . . . . . . . . .
. . . . . . . . [...]
: నందు ఉంచబడ్డది; the fantastic | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ మార్చి 1, 2007 ద్వారా జ్యోతి
ఒక స్వేచ్చా ప్రవక్త, ఒక హృదయవాది, ఒక సత్యాన్వేషి, ఒక ప్రకృతి ఆరాధకుడు, ఒక స్వాప్నికుడు,
ఒక గొప్ప సాహితీ శిల్పి, ఒక ప్రేమపిపాసి…ఈ ‘ఒక…’ లన్నీ కలిపి ఒక్క్డైన వ్యక్తి చలం. ‘ నే ప్రేమించని
సమయంలో బతికిలేనన్న మాట ‘ అని తనని తను నిర్వచించుకున్న శిఖర సమానుడు. పరస్పర
మానవ సంబంధాల్లోని పెత్తనం నుంచి విముక్తి కలిగించి దాని స్థానంలో ప్రేమను పాదుకొల్పడం
ద్వారా స్త్రీ పురుషులకొక ఆనందమయ లోకాన్ని సృష్టించాలని యత్నించిన సాహితీ యుగకర్త,
వైవాహిక ధర్మాల మీద,స్త్రీ [...]
: నందు ఉంచబడ్డది; the fantastic | అభిప్రాయాలు లేవు »