మధురమైన జ్ఞాపకం
టపా తేదీ మార్చి 1, 2007 ద్వారా జ్యోతి

పసితనాన పదిలంగా దాచుకున్న
మధురమైన జ్ఞాపకాలను
మనసు పేజీల మధ్య
ఎద గదుల ఇరుకుల్లో
ఒదిగిపోయిన అనుభూతులను
ఆప్యాయతలను
మననం చేసుకు మురిసినట్టుగా
కనులకున్న మనసుతో
మనసుకున్న కనులతో
మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుని
మగతగా వల్లించుకుంటున్నా
పందిరినిండా పరచుకున్న పారిజాతాళ్లా
మనసంతా అల్లుకున్న మాలతీలతల్లా
కనులకు సోకీ సోకని రీతిలో
కురుస్తున్న వెన్నెల వెలుగులు
జిలుగు జిలుగులుగా జగమంతా నిండితే
ఈ సుందరమైన ప్రకృతిలో
అమితానందాంబుధిలో
నువ్వు కళ్ళెదుట వున్నట్టే భ్రమ
నీ అనురాగపూరితమైన తలపు
కలిగిస్తోంది నాలో ఎన్నో అనుభూతుల్ని.
: నందు ఉంచబడ్డది; the fantastic

అద్భుతం.చాలా చాలా చక్కగా చెప్పారు.”పందిరినిండా పరచుకున్న పారిజాతాలు…మనసు…”ఈ రెండు వాక్యాలు నన్నెంత గా అల్లుకున్నాయో తెలుసా?ఇప్పటిదాకా నా మసులో వున్న కొన్ని భావాలు కరిగిపోయి ఇవే మెదులుతున్నాయి.
ఊహలో మీ కవితను తలుపుకు తేస్తే,మనసు మత్తుగిల్లే.
కవిత చాలా బాగుంది. చివర్లో, “నీ అనురాగపూరితమైన తలపు” అని రాశారు కదా, దాని తరవాత ఇంకొక వాక్యం “నీ .. పిలుపు” అని ఎదైనా రాసుంటే బాగుండేది అని అనిపించింది.