ఉగాది ఎప్పుడు?
అస్సలు ఉగాది జరుపుకునేది చైత్ర శుద్ధ పాడ్యమి రోజు. ఈ సంవత్సరం గ్రహణం
వచ్చింది కాబట్టి 20తేదీన జరుపుకోవాలని పండితులు , శాస్త్రజ్ణులు నిర్ణయించారు.
కాని మన ( సకలకళాకోవిదులు ఉన్న) ప్రభుత్వం తేదీని మార్చి19 న జరుపు
కోమ్మంటున్నారు. దానికోసం పాపం ఇంటర్ పరిక్షను కూడా మార్చారు. మార్చమని
ఎవరడిగారంటా వీళ్ళని. ఇది వై యెస్ పంచాంగమా? ఆయన హిందువుకాదుగా.
వరుసగా సెలవులు కావాలని ఎవరైనా లంచం ఇచ్చారా?
మన రోశయ్యగారిని అడిగితే ప్రభుత్వ శాఖలోని పండితులు శాస్త్రాలు చూసి చెప్పా
రంటారు. గ్రహణం రోజున దేవాలయాలు మూసివేస్తారుగా అంటే ఎదో తలతిక్క
సమాధానం ఇచ్చారు. ప్రభుత్వంలోఉన్నపండితుల పాండిత్యం అలా ఏడ్చింది
మన మంత్రులాగే! గ్రహణం ఐపోయాకా ఉగాది చేసుకోవాలని ఉచిత సలహా
ఇచ్చారు మన పూజ్య రోశయ్యగారు …
ఏం చేద్దాం?…………….
: నందు ఉంచబడ్డది; Funny

మన రాష్ట్రంలో హిందూ పండుగల విషయంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇంత గందరగోళం ఏర్పడ్డానికి కారణం-తిరుపతిలో తిష్ఠ వేసిన వైష్ణవ పండితుల మీద మన ప్రభుత్వం అతిగా ఆధారపడడం. ఈ ఆధారపడ్డంలో నాయుడుగారు రెడ్డిగారు అనే తేడా లేదు.ఇలా ఆధారపడ్డానికి కారణం - మనవారికి మన (తెలుగు) జ్యోతిష్య కాల గణనా సంప్రదాయాలు తెలియకపోవడం.తెలుగు వైష్ణవులు అన్ని విషయాల్లోను తమిళనాడు వారిని అనుకరిస్తారు. కాని తమిళ సంప్రదాయం తెలుగు సంప్రదాయం ఒకటి కావు.తమిళులది సౌరమాన జ్యోతిష్యం. తెలుగువారిది చాంద్రమాన జ్యోతిష్యం. కాని తమిళుల రాహుకాలం వగైరా తెలుగు సంప్రదాయంలో ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం అనుసరించే పరాశర హోరా జ్యోతిష్యంలో రాహుకాలానికి స్థానం లేదు-వర్జ్యం దుర్ముహూర్తం తప్ప. అందుచేత మనం నిజానికి రాజమండ్రి పండితులు చెప్పిన ప్రకారం నడుచుకోవాల్సి ఉంది.తిరుపతి పండితుల్ని త్రోసిపుచ్చక తప్పదు.