సింహం

       (మఖ,పుబ్బ, ఉత్తర 1వపాదం)

ఆదాయం-8 వ్యయం-14 రాజపూజ్యం-1 అవమానం-5

 

రాశివారికి గురుడు నాలుగింట రజితమూర్తి తదుపరి సంవత్సరమంతా ఐదింట లోహమూర్తి,

శని జులై 15 వరకు పన్నెండింట రజితమూర్తి. తదుపరి వత్సరమంతా జన్మమందు లోహమూర్తి.

రాహువు ఏడింట కేతువు జన్మమందు సంవత్సరమంతా సువర్ణమూర్తులు.  రాశివారికి

గురుడు అర్ధశుభుడు. వీరు ఉన్నత వ్యక్తిత్వం, పట్టుదల,నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.

 ఇతరులకు మార్గదర్శకత్వం వహించడంలో వీరికి వీరే సాటి. ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు

కనిపిస్తున్నాయి. సెప్టెంబరు తరువాత లాభస్థానంలొ కుజుడు, పంచమ స్థానంలో గురు సంచార

 బలంతో తనదైన శైలిలో ఆత్మవిశ్వాసంతో పురోగమిస్తారు. నూతన కార్యములందు ఆసక్తి

జనిస్తుంది. ప్రయోగాలు చేసేందుకు ఉత్సాహం ప్రదర్శిస్తారు. మరో వైపు ఇంటా బయటా 

సమస్యలు, కుటుంబంలో ఒకరికి ఆరోగ్యలోపం వీరి ఓపికని పరీక్షిస్తు ఉంటుంది. విద్యార్ధులు

అధికంగా శ్రద్ధ చూపితేనే సత్ఫలితాలు సాధించే అవకాశం ఉంది. ఉద్యోగరంగంలోని వారికి

శ్రమాధిక్యం తప్పదు, 

 

లక్ష్యసాధనలో అవాంతరాలు ఎదురవుతాయి. భూ,గృహరంగలో పెట్టుబడులు ఫలించడంలో

జాప్యం జరుగుతుంది. నిధులు స్తంభించి పోయే  అవకాశం ఉంది. భాగస్వామ్య సమస్యలు

ఉన్నప్పటికీ భవిషత్తులో విశేష లాభాలు చవి చూస్తారు. శుభకార్యాలలో ఆటంకాలు

ఎదురయ్యే అవకాశాలున్నాయి. వ్యవసాయరంగం, స్టాకిస్టులు, స్టాక్‌మార్కెట్ రంగంలో ఉన్న

వారికి పురోగతి అంతంత మాత్రం . యంత్రాలు, బంగారం, వస్త్రాలు, రసాయన వ్యాపారులు

బోధనా రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు ఎదురవుతున్నా ఏడాది ద్వితీయార్ధం నుంచి

 గుర్తింపు గౌరవాలు లభిస్తాయి. ఆర్ధిక రంగంలో పురోగతి కనిపిస్తుంది. సన్మానాలు,

సత్కారాలకు ఆస్కారం ఉంది.

 

జన్మశని సంచారం ఫలితంగా ఆరోగ్య సమస్యలు తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయి.

అధికారులతో మనస్పర్ధలు,కోర్టుల చుట్టూ తిరగవలసిన పనులు బడే అవకాశం ఉంది.

ఖర్చులు అధికంగా ఉంటాయి. అకాల భోజనం, అకాల ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి.

మనశ్శాంతి లోపిస్తుంది సౌఖ్యం తక్కువ. ఖర్చు ఎక్కువగా ఉంటుంది. కిరాణా, కోళ్ళఫారం,

 రైస్ మిల్లరులు, మత్స్యం, షేర్లు, రియల్ ఎస్టేటు రంగాల వారికి 1,3,4,5,7,8,11 మాసాలలో

విశేషలాభాలుంటాయి. రాశివారికి అదృష్ట సంఖ్యలు 1,2,3,5,9 ఆది, మంగళ,

గురువారములు యోగప్రదములు.

 

మొత్తం మీద రాశివారికి జన్మశని ఉన్నా సంవత్సరం  ద్వితీయార్ధంలో కొంత శుభ

ఫలితాలు కనిపించే అవకాశాలున్నాయి. సంకల్ప సిద్ధి కోసం సూర్య నమస్కారాలు, దుర్గ

సర్వసూక్త పారాయణ, శివ ఆరాధనలు, గోసేవ, శివ పంచాక్షరీ మంత్ర జపం, శివదర్శనం,

శనికి తైలాభిషేకం శుభప్రదం. మఖనక్షత్రం వారు వైడూర్యం, ముత్యం, పుబ్బవారు వజ్రం,

పచ్చ, ఉత్తరవారు కెంపు, పుష్యరాగం ధరించిన అదృష్టప్రదం.

Leave a Reply