కర్కాటకం

    (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష)
 
ఆదాయం-5 వ్యయం-2 రాజపూజ్యం-5 అవమానం-2
 
కర్కాటక రాశివారికి నవంబరు 21 వరకు గురుడు ఐదింట సువర్ణమూర్తి. తదుపరి ఆరింట
తామ్రమూర్తి, శని జన్మమందు జులై 5 వరకు తరువాత రెండింట సువర్ణమూర్తి. ఏడాది అంతా
 రాహువు ఎనిమిదింట, కేతువు రెండింట లోహమూర్తులు.ఉగాది నుంచి నవంబర్ వరకు
గురుసంచార ప్రభావం వల్ల కర్కాటక రాశివారికి విశేష శుభఫలితాలు కనిపిస్తాయి. గౌరవ
మర్యాదలు పెరుగుతాయి. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. బంధుమిత్రులతో సఖ్యత
పెరుగుతుంది. సంకల్పం నెరవేరుతుంది. శని, [...]

సింహం

       (మఖ,పుబ్బ, ఉత్తర 1వపాదం)

ఆదాయం-8 వ్యయం-14 రాజపూజ్యం-1 అవమానం-5
 
ఈ రాశివారికి గురుడు నాలుగింట రజితమూర్తి తదుపరి సంవత్సరమంతా ఐదింట లోహమూర్తి,
శని జులై 15 వరకు పన్నెండింట రజితమూర్తి. తదుపరి వత్సరమంతా జన్మమందు లోహమూర్తి.
రాహువు ఏడింట కేతువు జన్మమందు సంవత్సరమంతా సువర్ణమూర్తులు.  ఈ రాశివారికి
గురుడు అర్ధశుభుడు. వీరు ఉన్నత వ్యక్తిత్వం, పట్టుదల,నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు.
 ఇతరులకు మార్గదర్శకత్వం వహించడంలో వీరికి వీరే సాటి. ఈ ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు
కనిపిస్తున్నాయి. సెప్టెంబరు [...]

కన్య

 
     (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2, పాదాలు)

ఆదాయం-11 వ్యయం-5 రాజపూజ్యం-4 అవమానం-5
 
ఈ రాశివారికి గురుడు నవంబరు 21 వరకు మూడింట లోహమూర్తి. తదుపరి నాలుగింట
తామ్ర మూర్తి. శని జులై 15 వరకు పదకొండింట లోహమూర్తి. తదుపరి ఏడాది అంతా
పన్నెండింట సువర్ణమూర్తి. రాహువు ఆరింట.కేతువు పన్నెండింట తామ్రమూర్తి. ఈ రాశి
వారికి జులై 15 నుంచి ఏలినాటి శని ప్రారంభం అవుతున్నది. అయితే ఈ రాశి అధిపతి
బుధునకు శని అత్యంత మిత్రుడు కాబట్టి మూర్తిమంత [...]

తుల

 
     (చిత్త 3,4 స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు)
 
అదాయం-5 వ్యయం-8 రాజపూజ్యం-7 అవమానం-1
 
 
ఈ రాశివారికి గురుడు నవంబరు 21 వరకు రెండింట సువర్ణమూర్తి. తదుపరి సంవత్సరమంతా
 మూడింట తామ్రమూర్తి. శని జులై 15 వరకు పదింట, తదుపరి పదకొండింట రజితమూర్తులు.
 ఈ రాశివారికి నవంబరు వరకు యోగప్రదం. ఉత్సాహప్రదం. కుటుంబ సౌఖ్యం కలుగుతుంది.
ఆరోగ్యం పెంపొందుతుంది. సంకల్పం ఫలిస్తుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. బంధు
మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కొంతకాలంగా వృత్తి వ్యాపారాలలో ఉన్న స్తబ్దత తొలగి
పోతుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. [...]

వృశ్చికం

              (విశాఖ 4, అనూరాధ, జ్యేష్టా)
 
ఆదాయం-11 వ్యయం-14 రాజపూజ్యం-3 అవమానం-1
 
 
ఈ రాశివారికి గురువు నవంబరు 21 వరకు జన్మమందు, తదుపరి సంవత్సరమంతా రెండింట
 రజితమూర్తి. శని జులై 15 వరకు తొమ్మిదింట తదుపరి సంవత్సరమంతా పదింట రజితమూర్తి.
రాహువు నాలుగింట, కేతువు పదింట లోహమూర్తులు. ఈ రాశివారు వ్యవహారదక్షులు.
స్వలాభం, సంఘసేవాతత్పరత రెండూ వీరిలో కనిపిస్తాయి. నిదానంగా, నిగూఢంగా
వ్యవహరిస్తారు. వీరికి నవంబరు వరకూ గురుడు జన్మరాశిలో ఉన్నాడు. చతుర్ధ మందు
రాహువు, పదింట కేతువు మిశ్రమ యోగకారకులు [...]