jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

రాముకు–పుట్టినరోజు శుభాకాంక్షలు

రాసినది జ్యోతి పై ఏప్రియల్ 5, 2007

    

 వీరబల్లి వీరుడు, రాముడు మంచి బాలుడు టైప్ మన రానారెకు పుట్టినరోజు శుభాకాంక్షలు..

పెళ్ళి కళ కొట్టొచ్చినట్టుగా ఉంది కదా ?

   

11 స్పందనలు కు “రాముకు–పుట్టినరోజు శుభాకాంక్షలు”

  1. కొత్త పాళీ చెప్పబడిన

    నిజంగానా, లేక ఇస్మైల్ బై టైపులో కొంచెం ఆలస్యంగా ఫూల్స్ చేస్తున్నారా?

    నిజమే ఐతే .. రానారె, త్వరలోనే ఒక ఇంటివాడివి కావాలని ఆశీర్వదిస్తూ …

  2. సుధాకర్ చెప్పబడిన

    ఎవరక్కడ ? రానారె ప్రభువులకు నా జన్మ దిన శుభాకాంక్షలు దండిగా అందజేయుడు. లక్ష నుడికారములను మా రాజ్యము తరపున అందజేయుడు. రాజ్యమంతటా గుడ్ థర్స్ డే ను ప్రకటింపుడు.

  3. నవీన్ గార్ల చెప్పబడిన

    [[వీరబల్లె]] ”’రామనాథమూ”’ నీకు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుడు నీకు మరియు నీ కుటుంబానికి [[ఆరోగ్యం]], [[ఐశ్వర్యం]], [[ఆనందం]] ఇవ్వాలని కోరుకొంటున్నాను.
    [[వర్గం:శుభాకాంక్షలు]]
    [[వర్గం:రానారె]]
    [[వర్గం:వీరబల్లె యువకులు]]
    [[వర్గం:హ్యూస్టన్ సోగ్గాళ్ళు]]
    [[వర్గం:యూనీకోడ్ ఆంధ్రమహాభారతం సభ్యులు]]

  4. అన్నా రానారె నీకు నా “హాపీ బర్త్ డే” కాక “పుట్టినరోజు” శుభాకాంక్షలు.
    ఏంటీ పుట్టినరోజు స్పెషలు మరి ? ఇండియా లో ఉంటే పార్టీ అడీగేవాళ్ళము… ప్చ్.
    జ్యోతి గారన్నట్టు పెళ్ళీడు వచ్చేసింది, ఇక చూడడం మొదలెట్టు మరి.

  5. సత్యసాయి చెప్పబడిన

    రానారె
    “పుట్టినరోజు” శుభాకాంక్షలు

  6. నవీన్ గార్ల చెప్పబడిన

    రానారె..ఒక ముఖ్యమైన వర్గం మరచిపోయా
    [[వర్గం:పెళ్ళీడు కుర్ర్రాళ్ళు]] ;)

  7. radhika చెప్పబడిన

    పెళ్ళికాని రానారే కి [పెళ్ళికాని ప్రసాదులాగా]జన్మదిన శుభాకాంక్షలు.ఇంకెందుకాలస్యం చిన్నప్పటి పుట్టిన రోజు జ్ఞాపకాలని మాతో పంచుకోండి రానారే.మీ బ్లాగులో ఎదురుచూస్తూవుంటాము.

  8. హవ్వ…
    రాధిక గారు ఎంత మాటన్నారు. పెళ్ళి కాని రానారె నా, తలచుకోవాలే గానీ రానారె కి ఎదురేంటి. అమ్మాయిలు క్యూ కట్టారూ ?

    రానారె ఇప్పటికయినా రోషం తెచ్చుకుని మరి పిల్లనెతుక్కోవయ్యా బాబూ.

  9. రానారె చెప్పబడిన

    జ్యోతిగారూ, మీ శుభాకాంక్షలకు, అభిమానానికి చాలా చాలా థాంక్స్. “కొట్టొచ్చినట్టుగా…(ఎవరినో మరి)” అంటూ ఇంకో మలుపు తిప్పి వదిలేశారు, పుట్టినరోజును అలా ఉండనీయక, మీకిది భావ్యమా? :) )

    కొత్తపాళీగారు, మీరుకూడానా? మంచిదే, బహుధా కృతజ్ఞుడను.

    సుధాకర సామ్రాట్టులుంగారు, మీ ఆత్మీయతను ఇంతని కొలుచుకు మాకు శక్యముగాకున్నయది. మీ శుభాకాంక్షలు మానసమున కడు సంతసమాయెను. మమ్ము మీ యభిమాన నుడి’కారాగారము’న బందీని గావించినారు. మీకివే మా ధన్యవాదశతములు.

    నవీన్ ‘గార్లు’, మిక్కిలి సంతోషము. తెవికీ కి పునరంకితము కావలెనను సందేశము కూడా మాకు అందినది. ముఖ్యమగు వర్గమనుచూ మళ్లీదాడియేల! :)

    ఆచార్యులవారికి అభివాదములు.

    రాధికగారూ, ధన్యవాదాలు. ఇంకెందుకాలస్యం అంటూ నాకు రెండు కర్తవ్యాలు బోధించారు కూడా.

    తమ్ములుంగారికి కృతజ్ఞతలు. ఎంత రోషము వచ్చిననూ మనం నేలమీదనే సాము శాయవలెనన్న సంగతి మరువరాదు కదా! :) పుట్టినరోజుల సంబరాలు మాని పుష్కరకాలమయింది. ఆ సంగతులు త్వరలో చెబుతాను.

  10. vihaari చెప్పబడిన

    రామయ్యా,

    ఇదిగోనయ్యా శుభాకాంక్షల మందార మాలలు. అదిగో..అదిగదిగో సీతమ్మ ఏతెంచుచున్నది. ఇంధ్ర ధనుస్సును ఎక్కుపెట్టు సమయమాసన్న మయినచో ఎక్కుపెట్టుడు లేదనినచో దానిని సీతమ్మ మందిరంలో వుంచి అడుకోనివ్వుడు.

    విహారి

  11. రానారె చెప్పబడిన

    థాంక్యూ విహారిగారూ :)

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>