టపా తేదీ ఏప్రియల్ 17, 2007 ద్వారా జ్యోతి
ప్రశ్నలు అడగమన్నారుగా! ఐతే కాసుకోండి. ఈ చిత్రానికి విచిత్రమైన డైలాగ్ కొట్టండి. చూద్దాం.
ప్ర. పడ్డవాడెప్పుడు చెడ్డవాడు కాదు అంటారు కదా! మరి పడనివాడు?
జ.
ప్ర.బ్రహ్మచారులు కనిపిస్తారు కాని విష్ణుచారులు, శివచారులు ఎందుకు కనిపించరు?
జ.
ప్ర. అమెరికా వాళ్ళు మొబైల్ ఫోన్ కనిపెట్టారు. జపాన్ వాళ్ళు అందులోకి సిమ్ కార్డుని కనిపెట్టారు. మరి మన వాళ్ళు?
జ.
త్వరపడండి……..
: నందు ఉంచబడ్డది; Funny | 3 వ్యాఖ్యానాలు »
టపా తేదీ ఏప్రియల్ 17, 2007 ద్వారా జ్యోతి
ఒక సినిమా పాటకు అనుకరణ:
పోను పోనంటూనే పోరడూ పోరడూ
అమెరికా పోయిండే పోరడూ పోరడూ
వద్దు వద్దంటూనే గుంటడూ గుంటడూ
డాలర్ల వెనకురికే గుంటడే గుంటడూ || పోను ||
కంప్యూటర్లే బోగస్సని కుచ్చుటోపి పెడతాయని
కహానీలు ఇన్పించే పోరడు
కలల్లోన తేలిపోతు కోటికి పడగెత్తాలని
కొలంబియా పోయిండే పోరడూ
ఔనా అయ్యో పరేషాన్ అవుతాడే
పాపం పసివాడే పోరడూ || పోను ||
వున్నదేదో అమ్ముకుని ఊరినంత వదులుకుని
వర్జీనియా దారిపట్టే పోరడూ
దిమాఖంత ఖరాభైంది దిగులుచెంది దీనంగా
వీధులెంట తిరిగినాడే పోరడూ
ఔరా అతిగా ఆశపడి అల్లాడెనే
అమెరికాలో ఆంధ్రావాడే పోరడూ || పోను ||
తొలి [...]
: నందు ఉంచబడ్డది; Funny | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ ఏప్రియల్ 17, 2007 ద్వారా జ్యోతి
శ్రీరస్తు *********** శుభమస్తు *********** అవిఘ్నమస్తు
వివాహ మహోత్సవ ఆహ్వాన పత్రిక
స్వస్త్రిశ్రీ చాంద్రమాన శ్రీ వ్యయనామ సo|| ర ఫాల్గుణ బ|| నవమి ఆదివారము తేది 25.2.2007 ఉ|| గం|| 10.17 ని|| లకు రోహిణీ నక్షత్ర యుక్త మేషలగ్న పుష్కరాంశ సుముహూర్తమున
మా కనిష్ట పుత్రుడు
చి|| మసాలాదోసె
కు
చి||ల||సౌ|| బంగాళదుంపఖుర్మా
తో
(మ||రా|| శ్రీమతి & శ్రీ టొమాటో శర్మగారి ద్వితీయ పుత్రిక)
వివాహము జరిపించుటకు దైవజ్ఞులు నిర్ణయించినారు.కావున తామెల్లరు బంధుమిత్ర సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి, నూతన వధూవరులను ఆశీర్వదించి,మాచే నొసగబడు [...]
: నందు ఉంచబడ్డది; Funny | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ ఏప్రియల్ 14, 2007 ద్వారా జ్యోతి
సీ. పాద పంకజములకు పారాణి యద్దేటి సరిగంచు నిగనిగల చక్కదనము
నెన్నడుము చుట్టుకొని నెమలి వన్నెలు జిల్కు రంగైన నడికట్టు రాచ ఠీవి
అవనికేతెంచు గంగా ఝరీ తరగలై కురిసేటి కుచ్చిళ్ళ కులుకు పలుకు
కాంతుని మదిగెల్చు కందర్ప కేతువై పైరగాలుల రేపు పైట జిలుగు
ఆ.వె. చీర కట్టు లలన చిలిపి వన్నెల భరిణ
చీర కట్టు పడతి సిరుల ప్రోవు
చీర కట్టు లేమ సింగారముల సీమ
చీర సొగసు బొగడ శివుని తరమ?
చెన్నైలోని ఒక ప్రముఖ చీరల వ్యాపారస్థులు ఈ చీరను [...]
: నందు ఉంచబడ్డది; the fantastic | 6 వ్యాఖ్యానాలు »
టపా తేదీ ఏప్రియల్ 12, 2007 ద్వారా జ్యోతి
తెలుగుబ్లాగర్లందరికి అభినందనలు. గూగుల్‌లోనూ,ఆర్కుట్లోనూ ఉన్న తెలుగుబ్లాగు
గుంపులో చేరమని సవినయ ఆహ్వానం అందుకోండి.ఇందులో చేరి తెలుగుబ్లాగింగులోని
సమస్యలు, సందేహాలు, చర్చలు, మరియు ప్రతినెలా జరిగే బ్లాగరుల సమావేశాల్లో
పాల్గొనండి. ఆలస్యమెందుకు. వచ్చేయండి మరి.
, http://groups.google.com/group/telugublog
http://www.orkut.com/Community.aspx?cmm=1068934
: నందు ఉంచబడ్డది; general | అభిప్రాయాలు లేవు »