పుష్పవనం

రండి.. మీరే ఒక పుష్పవనాన్ని సృష్టించండి. క్రింది లంకెలో మీ ఎలుక తలతో మొట్టి చూడండి. పదే పదే
చేయండి. పలు పుష్పాలు మీ సొంతం…మరి ఆలస్యమెందుకు???
http://www.procreo.jp/labo/flower_garden.swf

రాముకు–పుట్టినరోజు శుభాకాంక్షలు

    
 వీరబల్లి వీరుడు, రాముడు మంచి బాలుడు టైప్ మన రానారెకు పుట్టినరోజు శుభాకాంక్షలు..
పెళ్ళి కళ కొట్టొచ్చినట్టుగా ఉంది కదా ?
   

పెళ్ళిచూపుల ప్రహసనం

ఏంటండి మాస్టార్లు,
పెళ్ళిమాటలంటే అంత ఆటలా మీకు. ఈ తోటరాముడుగారు తమ కష్టాలు చెప్పుకునివాపోయారు. మిగతా పురుష పుంగవులేమో అయ్యో పీత కష్టాలు సీత కష్టాలు అని ఓదార్చుకుంటునారు. ఏంటి కాస్త అందంగా కనపడడానికి ఫోటో దిగడానికి కూడాకష్టమేనా. అమ్మాయిలు కూడా దిగుతారు మరి మీలా చెప్పుకోరే. మీ అబ్బాయిలు కష్టపడేది పావు వంతు మాత్రమే. అమ్మాయిలకు ఇరవై ఏళ్ళు వచ్చాయో లేదో మొదలు మీ అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారా. ఎక్కువ చదివితే ఇంకా ఎక్కువ చదివిన మొగుడిని [...]