కలసి ఉంటే కలదు సుఖం

                                       
 ముదిమిలో తమను చూసుకోవడానికి పనికొస్తారని పిల్లలను కనే తల్లిదండ్రులు వ్యాపారం చేస్తున్నట్టే. ఆ ఉద్దేశంతో కన్నవారు పిల్లల ఆలనా పాలనా చూడటం, పెంచి పెద్దచేయడం ఇవన్నీ పెట్టుబడి కిందికి వస్తాయి. పెట్టుబడి పెట్టినవారందరికీ లాభం రావాలనేం లేదుగా! “దంపతులు కలసి జీవించడం ఒక యాక్సిడెంటు, పిల్లలు కలగడం ఒక ఇన్సిడెంటు. నిన్ను నవమాసాలు మోసి, కని, పెంచీ, నీకు అదిజేసి ఇదిజేసి…. ఇలాంటి మాటలన్నీ ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్. కనమని వాడడగలేదు. కన్నాక వాడిని పెంచడం [...]

ప్రకృతి

ప్రకృతిని అనుసరించి సోదరా
జీవన విధానం నువ్ గడపరా…
 
మన పూర్వులు బ్రతికినారు - నిండుగ నూరేళ్ళవరకు
ఆహారంలోనే మనకు - అన్ని మందులున్నవంటూ
ఆ మందులు వదలిపెట్టి - ఆసుపత్రి దారిపట్టి
ఇంగిలీషు మందులతో - ఎంగిలైపోతున్నాము.    ll  ప్రకృతి ll
 
బంతాకుల ముద్ద చేసి - మిరియాల చూర్ణమేసి
రేగిగింజంత మాతరంట - పూటకొకటి వేసుకొంటే
ఎన్నెన్నో మందులు నువ్ - వాడినా తగ్గలేని
పైల్స్ రోగమంటు నీకు - లేకుండా తగ్గుతుంది   ll ప్రకృతి ll
 
కీళ్ళనొప్పులంటు నువ్ - నడవలేక బాధపడితే
ఆవాలు గసగసాలు - [...]