ప్రకృతి
రాసినది జ్యోతి పై మే 2, 2007
ప్రకృతిని అనుసరించి సోదరా
జీవన విధానం నువ్ గడపరా…
మన పూర్వులు బ్రతికినారు - నిండుగ నూరేళ్ళవరకు
ఆహారంలోనే మనకు - అన్ని మందులున్నవంటూ
ఆ మందులు వదలిపెట్టి - ఆసుపత్రి దారిపట్టి
ఇంగిలీషు మందులతో - ఎంగిలైపోతున్నాము. ll ప్రకృతి ll
బంతాకుల ముద్ద చేసి - మిరియాల చూర్ణమేసి
రేగిగింజంత మాతరంట - పూటకొకటి వేసుకొంటే
ఎన్నెన్నో మందులు నువ్ - వాడినా తగ్గలేని
పైల్స్ రోగమంటు నీకు - లేకుండా తగ్గుతుంది ll ప్రకృతి ll
కీళ్ళనొప్పులంటు నువ్ - నడవలేక బాధపడితే
ఆవాలు గసగసాలు - వెల్లుల్లి కర్పూరం
పెరుగుతో ముద్ద చేసి - పట్టు వేసి కట్టు కడితే
కీళ్ళనొప్పులంటూ నీకు - మచ్చుకైన ఉండవయ్యా ll ప్రకృతి ll
ఒక గరిటెడు ఆవునెయ్యి - పదిగ్రాములు వేయిస్తూ
అందులోనే ఒక ఎండు - మిరపకాయ వేసి చూడు
మరిగినాక మిరపకాయ - తీసివేసి ఆవునెయ్యి
ఆ నేతిని తింటే నీకు - కడుపునొప్పి తగ్గుతుంది ll ప్రకృతి ll
మిరియాలు కండ చక్కెర - ఆవునెయ్యిలోన కలిపి
ఆవునెయ్యిలో కొంత - మిరియాలపొడిని వేసి
ప్రతిరోజు పరగడుపున - కమ్మంగా తింటుంటే
సాయంత్రం కాగానే - తడుముకుంటూ తిరుగుతున్న
రేజీకటి యంటు నీకు - లేకుండా పోతుంది. ll ప్రకృతి ll
రక్తంలో బలహీనతచే - కాళ్ళు చేతులుబ్బుతాయి
ఉబ్బు కామెర్ల బోదకాలు - నూసిలాడి చెబుతారు
ఇంజక్షన్ మందులలో - తగ్గలేని బోదకాళ్ళూ
గోమూత్రం వస కొమ్ముతో - తగ్గుతుంది బోదవాపు ll ప్రకృతి ll
వాము, మిరియం, శొంటి - సమభాగం చేసుకొని
రెండుపూటలా నువ్వు - ఇరవై రోజుల వరకు
పట్టు తేనెలో నువ్వు - శుభ్రంగా వాడినచో
దగ్గు, ఆయాసం నీకు - తగ్గుతుంది ఖచ్చితంగా ll ప్రకృతి ll
కోడిగుడ్డు సొన సైందవ - లవణం నెయ్యిని గలిపి
పేస్టువలె చేసి నువ్ - నడుముకు మర్ధించినచో
నిద్రపోవు ముందు కాస్త - నడుముకు పట్టేసినచో
నడుమునొప్పి మూడు - నాలుగు రోజులలో నయమవును ll ప్రకృతి ll
పల్లేరాకు తెచ్చి నీళ్ళు - కలపకుండ దంచి
రసం తీసి, వడపోసి - పూటకో ఔన్సులాగా
మోతాదుగా రెండు లేక - మూడు పూటలు వాడితే
మూత్ర వ్యాధులన్ని నీకు - నిర్మూలంబవును ll ప్రకృతి ll
ఒక ఆయుర్వేద పత్రికలో చదివినది. ఇవి అన్ని హానికరము కానివి అని పెద్దలు లేదా
మన డాక్టరుగారు(SMILE) చెప్పాలి.
నేనుసైతం చెప్పబడిన
జ్యోతి గారు,
ప్రకృతి వైద్యం లోని గొప్పతనం చక్కగా చెప్పారు.
-నేనుసైతం