నమస్తే అన్నా!

అన్నలకు, తమ్ములకు , అక్కలకు, చెల్లెండ్రకు అందరికి నమస్తె చెప్తున్న. అందరు మంచిగున్నరా. పొరగాండ్లకు పరీక్షలు ఐపోయినయి కదా. ఇంట్ల లొల్లి లొల్లి చేస్తున్నరా. ఇగో మీకో సంగతి చెప్దమని ఇలా వచ్చిన.మన ఐద్రాబాదుల ప్రతినెల తెలుగు బ్లాగులో bలాగులో రాసెటోల్ల మీటింగులు జరుగుతున్నయ్ కదా . అందులనేమో ఆడోళ్ళను పిల్వరు.పిల్వని పేరంటానికి ఎవరు పోతరు అని ఊర్కున్న. అంతా మొగోళ్ళే కల్సుకుని మాట్లాడుకుంటరు .కాని కిరణ్ అని ఓ పోరగాడు ఈ నెల మీటింగుకి రమ్మని [...]