jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

అమ్మ మనసు

రాసినది జ్యోతి పై మే 20, 2007

గగనాన పూసిన తారల కుసుమాలు కోసి
జడలో తురుముతానంటే
అమ్మ నవ్వింది మురిపెంగా
అంబరాన మెరిసే హరివిల్లు తెచ్చి ఊయల కట్టి
ఊపుతానంటే ఉప్పొంగి
ముద్దులాడింది ముచ్చటగా
మబ్బుల్లో జాబిలి కోసం
మారాం చేస్తే అద్దమిచ్చి
బుజ్జగించి బొజ్జ నింపింది ఆప్యాయంగా
వానజల్లు కురిసి
వళ్ళంతా తడిసి వణుకుతుంటే
తుమ్ములొస్తాయిరా కన్నా
అంటూ తల్లడిల్లింది బాధగా
ఉరిమే మేఘాలను చూసి ఉలిక్కిపడితే
ఊరడించి వెన్నుతట్టింది మమతగా
గజగజలాడే పొగమంచు కమ్మేసినపుడు
వెచ్చటి తన ఒడిలో
చోటిచ్చింది ప్రేమగా
నిప్పులు కక్కే గ్రీష్మంలో
తన కొంగు గొడుగుగా
పట్టి ఆ నీడలో సేద తీర్చింది చల్లగా
అనుక్షణం అనుసరించి అన్నింటా తొలిగురువై
మాతృత్వాన్ని పంచింది మధురంగా
తన ఆలంబనతో ఉన్నత శిఖరాలు
అధిరోహించినపుడు అశ్రునయనాలతో
అక్కున చేర్చుకొంది ఆనందంగా
వయోభారంతో అసరా కోసం
ఆర్తిగా చేయి అందించమంటే
నువ్వే నాకు భారం అన్న నన్ను
కరుణతో చూస్తూ
కలకాలం నా బిడ్డని కాపాడు
అంటూ దైవాన్ని ప్రార్ధించింది తల్లిగా..

రచన: అడపా పద్మ..

ఈ పద్యం నాది కాదు ఒక పత్రికలో చదివి నచ్చి ఇక్కడ రాస్తున్నా. మా అమ్మ నన్ను ఇలాగే పెంచింది నేను నా పిల్లలను ఇలాగే పెంచుతున్నా. అందుకే ఇది నా హృదయానికి హత్తుకుంది. ఇలాంటి అమ్మ లేనివారు, తెలీనివారు దురదృష్టవంతులు, కోట్లకు పడగలెత్తిన్నా బికారులు అని నా అభిప్రాయం.

6 స్పందనలు కు “అమ్మ మనసు”

  1. anon చెప్పబడిన

    బాగుంది. పద్మ గారు చక్కగా వ్రాసారు. కాని మరిఒకరు వ్రాసినది ఇలా ప్రచురించవొచ్హా..నిజమే వారికి ఇది అపాదించినా కూడా?

  2. lalithag చెప్పబడిన

    రాసిన వారికి అభ్యంతరమైతే, వారు తెలిపితే తీసేస్తారు లెండి. భావం గమనించండి.

  3. radhika చెప్పబడిన

    చాలా చాలా బాగుందండి.

  4. జ్యోతి చెప్పబడిన

    నేను ఈ కవిత నచ్చి ఇక్కడ రాసుకున్నా.దీనికి కాపీరైట్ లేదు. రచయిత్రి అభ్యంతరం చెబితే తప్పక తీసేస్తాను. ఐనా ఇది లక్షలాది అమ్మల మనసు. ఎవరికీ అభ్యంతరముండదు అనుకుంటున్నాను.

  5. శ్రీనివాసకుమార్ చెప్పబడిన

    కవిత చాలా బాగుంది. రచయిత్రి పేరు ఇవ్వడంతో పాటు ఈ కవిత తనది కాదని జ్యోతి నిజాయితీగా చెప్పారు.అందువల్ల కాపీరైట్ సమస్య రాదు. పైగా తన రచనకు ఇలా ప్రాచుర్యం దక్కడం పట్ల పద్మగారు కూడా సంతోషిస్తారు. పత్రికా రంగంలో కూడా ఇతర పత్రికల నుంచి ఫొటోలు లేదా వ్యాసాలు తీసుకున్నప్పుడు “సౌజన్యం” అని ఆ పత్రిక పేరు ఉటంకించడం మనకు తెలిసిందే. ఇందులో సమస్యేమీ లేదు. జ్యోతి గారూ… మానవత, మమతానురాగాలతో ముడిపడి ఉన్న ఇలాంటి మంచి రచనలు ఇంకేమైనా ఉంటే తప్పక పోస్ట్ చెయ్యండి. ఆస్వాదిస్తాం… ఆ మాధుర్యాన్ని అనుక్షణం శ్వాసిస్తాం…

  6. Andy చెప్పబడిన

    Nice Blog Jo

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>