బాబోయ్ - బాబాయ్

మన బాబాయ్ (అదేనండి గూగుల్) చేసే చిన్న తమాషా చూద్దామా!
http://www.googlism.com/index.htm
ఇక్కడ మీ పేరు కాని ఎవరిదైనా కాని టైప్ చేసి ఒక మొట్టికాయ వేయండి. ????

అమ్మా!

 మబ్బుల ఆకాశంలో ఆకాశ వీధులన్ని దాటిస్తూ
సన్నజాజుల వింజామరలూపి
ఎంచక్కని పూతేనెల విందులిచ్చి
నన్నెక్కడికి ప్రభూ పంపిస్తున్నావు?
ఇంతకన్నా అందమైన చల్లనైన ఒడికి
మమతల మురిపాల లోగిలికి…
తన యెదనే అమృతభాండాన్ని చేసుకుని
నీ చిన్నారి బొజ్జ నింపే
ఒక చక్కని దేవత చెంతకు పంపుతున్నా చిన్నారి.
ఎందుకు ప్రభూ? నీకంటే ప్రేమయినదా. ఆమె?
అవును నిన్ను లాలిస్తుంది. పాలిస్తుంది.
చేతులనే కోటగా చేసి అడుగడుగునా నిన్ను రక్షించుకుంటుంది
తీగకు పందిరిలా మొక్కకు నీరులా మారుతుంది.
ఎండకన్ను తెలియనీయని వృక్షమవుతుంది.
నువ్వు పూజించకున్నా నీ పాలిటి దేవతవుతుంది.
నీకోసం ప్రాణాలిస్తుంది.
ఆమె పూలజోలల లాలనలో, ఒడిన ఊగు వూయలలో 
నీకు ఈ [...]

అతడు - ఆమె

 ఒక రోజు ఒక స్త్రీ ఒక పురుషుడు వాగ్యుద్ధంలో పడ్డారు. ఎవరు ఎక్కువ కనుగొన్నారు అని. ఎంత గింజుకున్నా సమాధానం దొరకలేదు. సరే అని మన బాబాయిని అదేనండి Google అడుగుదామని కూర్చున్నారు. అమ్మయి she invented అని కొడితే ఎమొచ్చిందో చూడండి.. ఇది నిజంగా నిజం ..ప్రయత్నించి చూడండి.. చూసి తరించండి మురిసిపోండి ..సరేనా…

This is for all Telugu lovers..

Blogging in Telugu
The number of Telugu blogs has been increasing day by day. Especially, there is a phenomenal growth in the last six months. There seems to be more than a thousand Telugu blogs, with around 250 being regularly updated.
The topics covered by Telugu blogs range from comics to cinema, politics to poetry, media to [...]

నమస్తే అన్నా!

అన్నలకు, తమ్ములకు , అక్కలకు, చెల్లెండ్రకు అందరికి నమస్తె చెప్తున్న. అందరు మంచిగున్నరా. పొరగాండ్లకు పరీక్షలు ఐపోయినయి కదా. ఇంట్ల లొల్లి లొల్లి చేస్తున్నరా. ఇగో మీకో సంగతి చెప్దమని ఇలా వచ్చిన.మన ఐద్రాబాదుల ప్రతినెల తెలుగు బ్లాగులో bలాగులో రాసెటోల్ల మీటింగులు జరుగుతున్నయ్ కదా . అందులనేమో ఆడోళ్ళను పిల్వరు.పిల్వని పేరంటానికి ఎవరు పోతరు అని ఊర్కున్న. అంతా మొగోళ్ళే కల్సుకుని మాట్లాడుకుంటరు .కాని కిరణ్ అని ఓ పోరగాడు ఈ నెల మీటింగుకి రమ్మని [...]