డా.హాస్యానందం నవ్వులు

* షుగర్ పేషెంటు అదిరిపడేదెప్పుడు?
రాత్రి పడుకోబోయేముందు ఎవరైన తనకు స్వీట్ డ్రీమ్స్ అని చెప్పినపుడు.
* డాక్టర్ తెల్లబోయేదెప్పుడు?
మీ ప్రాబ్లం ఏమిటో చెప్పండి అనడిగితే ఈ మధ్య ఆయనేం తెచ్చినా ఆనందపడిపోతున్నాను అని లేడీ పేషంట్ చెప్పినప్పుడు.
* డాక్టర్ విస్తుపోయేదెప్పుడు?
మీరు దేవుడిలాంటివారు. ఈ కొబ్బరికాయ, చిల్లర తీసుకుని మావాడికి ఆపరేషన్ చెయ్యండి డాక్టర్ అని పేషెంట్ బంధువు అన్నప్పుడు.
* ఒబేసిటీ పేషెంట్ షాకయ్యేదెప్పుడు?
పూటకి ఒక్క ముగ్గు చొప్పున ఉదయం-1, మద్యహ్నం-2, రాత్రి-3. ఇలా నెల రోజులపాటు రెగ్యులర్ గా [...]

లవర్స్ లాఫింగ్ క్లబ్

అనుకోని అదృష్టమంటే?
ప్రపంచసుందరికి రాసిన ప్రేమలేఖకి జవాబు రావటం.
ప్రియురాలు అందంగా కనవడేదెప్పుడు?
ఇల్లాలు గుర్తొచ్చినప్పుడు.
ప్రేమకి, పెళ్ళికి తేడా?
మొదటిది ఇష్టమైన కూరతో సుష్టుగా భోజనం చేయడం, రెండవది ఏదో ఒక కూరతో సరిపెట్టుకుని అయిష్టంగా భోంచేయడం.
తొందరపాటు ప్రియుడు?
‘ఆకాశంలో అంత అందమైన మెరుపులు నువ్వెప్పుడైనా చూశావా?’ అని ప్రియురాలు అడిగితే ‘నీతో ఐస్‌క్రీం పార్లర్‌కి వచ్చినప్పుడల్లా నాకు కనిపించేవి అవేకదా!’ అనేవాడు.
ప్రియురాలు ఉలిక్కిపడేది ఎప్పుడు?
‘అర్జంట్‌గా నాకు వెయ్యి రూపాయలు వుంటే ఇవ్వు డియర్, పెళ్ళికి ఇవ్వవలసిన కట్నంలో తగ్గించేస్తాను’ అని ప్రియుడు అన్నప్పుడు.
ప్రియుడు [...]

చిన్నితెర చిరునవ్వులు

* టి.వి సీరియల్స్ వల్ల లాభం ?
పగలూ, ప్రతీకారాలు ఎలా తీర్చుకోవాలో నేర్చుకోవడం.
* టి.వి సామెత. కామెంట్ ప్లీజ్?
చూపించేవాడికి చూసేవాడు లోకువ.
* మరీ విడ్డూరమంటే ?
చీ పాడు సీరియల్ ఎంత సాగదీస్తున్నారో అని తిట్టుకుంటూనే మిస్సవకుండా టి.వి సీరియల్ని చూస్తూనే వుండటం.
* ఎక్కడ వేసిన గొంగళి అక్కడే వుండటంకు నేటి పేరడి?
తెలుగు టి.వి సీరియల్
* మూలిగే నక్క మీద తాటిపండు పడటమంటే?
రాన్రాను ప్రేక్షకాదరణ కోల్పోతున్న దూరదర్శన్ ని పే చానల్ గా మార్చాలనుకోవడం.
* ఏరాయితో కొట్టుకున్నా ఒకటే [...]

షడ్రుచుల సాహిత్యం

ఈ రచన నేను కొత్తపాళిగారితో కలిసి పొద్దు కోసం చేసింది…

ఆకలి రుచెరుగదు అని సామెత చెప్పిన మన పూర్వులే పుర్రెకో బుద్ధీ జిహ్వకో రుచీ
అని కూడా శలవిచ్చారు. కోటి విద్యలూ కూటికోసమే అయినా రుచి లేని కూడు ఎవరికి మాత్రం ఇష్టం చెప్పండి? మామూలు మానవమాత్రుల సంగతే ఇలాగుంటే నిజంగానే
మరి కోటి విద్యలు నేర్చిన మహా విద్వాంసులు, స్తుతమతులైన ఆంధ్ర కవులు , మన
తెలుగు కవిధూర్జటుల సంగతి వేరే చెప్పాలా?
 
 
“అప్పడుపు కూడు భుజించుటకన్న [...]

కనపడుటలేదు - 1

                                           
అందరికీ నమస్కారం. నాదొక విన్నపం. గత వారం రోజులనుండి మా శ్రీవారు కనభడటం లేదు గొడవేం లేదండి. పత్రికలలో ప్రకటన చూసి వారి బట్ట తలపై హృతిక్‌రోషన్‌లా జుట్టు మొలిపించుకోండి. ఇంకా అదేదో సినిమా చూసి నాకూ ఆదివారం సెలవు కావాలి అన్నా అంతే. కోపంతో ధుమధుమలాడుతూ వెళ్ళిపోయారు. ఇలా అడగడం తప్పా చెప్పండి? రెండ్రోజుల్లో తిరిగొస్తారులే అని ఊరుకున్నా. ఎక్కడికెళ్ళారో ఆచూకీ తెలీటంలేదు.ఆయన పేరా? అమ్మో భర్త పేరు ఎలా చెబుతారండి పాపం [...]