కనబడుట లేదు-2

                                      
 అందరికీ నమస్కారం. నా పేరు సత్యనారాయణ దీక్షితులండి . ఎవరా అనుకుంటున్నారా ?? అదేనండి నెలక్రితం కనపడటంలేదు అని మా ఆవిడ ప్రకటన ఇచ్చింది వీరవెంకట అలమేలు మంగతాయారు. ఆ శాల్తీని నేనేనండి . ఇంటికొచ్చేసానండి. రాక   చస్తానా. అయినా ఎవడా అడ్డగాడిద అన్నది ఆడది ఇల్లుదాటితే మంచిది కాదు బయటకెళ్ళి బ్రతకలేదు అని .. అసలు పెళ్ళైన మగాడు ఇల్లొదిలి వెళితే అస్సలు బ్రతకలేడండి. నా స్వానుభవంతో చెప్తున్నా . ఇంట్లో [...]

అందం చందం - సౌందర్యానికి సలహాలు

కుచ్చుటోపి - సచిత్ర వారపత్రిక
షోకు - నాజూకు (సౌందర్య సలహాల శీర్షిక)
నిర్వహణ: రంభ మరియు ఊర్వశి (ప్రముఖ బ్యూటీషియన్లు)
1. కుర్ర చూపుల వీరయ్య (మొర్రిపాలెం)
ప్ర. నా వయసు 81.. 18 లా కనిపించాలంటే ఏం చేయాలి?
జ. ఏం చెయక్కరలేదు. 63 ఏళ్ళు వెనక్కి వెళితే సరి.
2. మచ్చల పిచ్చయ్య (రచ్చపాడు)
ప్ర. పుట్టుమచ్చలు పోవాలంటే ఏం చేయాలి?
జ. మనం పోవాలి.
3. నిక్కుల నీరజ (కక్కులూరు)
ప్ర. నా వయసు 50 దాటింది. తలపై రెండు మూడు వెంట్రుకలు నెరవడం వల్ల [...]