తండ్రికో నమస్కారం

dad.pps 

తండ్రుల దినోత్సవం సంధర్భంగా చిన్న సమర్పణ…..

 
 
 
పిల్లల పెంపకంపై  Spenser Johnson రాసిన బెస్ట్ సెల్లర్ The One Minute Father లోని కొన్ని విషయాలివి.
తండ్రిగా మారిన , మారబోయే ప్రతి వ్యక్తి తెలుసుకోవలసినవి.
 
1.  తండ్రిగా మీ పిల్లల్ని నిరంతరం సంరక్షించదలచుకున్నారా? పిల్లలు తమని తాము
     సంరక్షించుకునేలా  పెంచదలచుకున్నారా?
 
2.  పిల్లవాడు తమకు అనుగుణంగా ప్రవర్తించడమే క్రమశిక్షణ అని చాలామంది తల్లితండ్రులు
     అనుకుంటారు.  కాని ఇది  తప్పు.  మీరు క్రమశిక్షణ అని దేన్ని భావిస్తారో అది తమకు [...]

అన్నా. ఓ! చికెన్ గున్యా!!!!

మళ్ళీ పొంచి ఉన్న చికెన్ గున్యా
ఈ రోజు ఈనాడులో ఈ వార్త చదవగానే గత సంవత్సరం ఈ వ్యాధితో నేను, మా ఇంట్లో వారు, తెలిసినవారు అందరూ పడిన కష్టాలు మళ్ళీ గుర్తొచ్చాయి…పోయినేడాది ఆ వ్యాధి బారిన పడినప్పుడు రాసుకున్న కవిత…మీరైనా జాగ్రత్త పడండి.
 
 
దోమతో వచ్చావు గున్నలా పెరిగావు
గున్యాలా మారావు
మనుష్యుల్ని నుజ్జు నుజ్జు చేసావు
ఎముకల గుజ్జంతా తిన్నావు.
 
 
కాళ్ళు తిన్నావు కీళ్ళు తిన్నావు
మొకాళ్ళు కూడా తిన్నావు
కోడిపేరు పెట్టుకున్నావు
వాటికే మచ్చ తెచ్చావ్ .
 
జ్వరమంటూ మొదలెట్టి
దవాఖానా కీడుస్తావ్
పిల్లల్ని తల్లుల్ని [...]

అవసరమా????

ఇది నేను ఎవరిని విమర్శించడం లేదు. ఎవరినీ బాధపెట్టాలని లేదు. నాకు కలిగిన సందేహాలు మాత్రమే. ఎవరైనా వీటిని తీర్చగలరేమో అని నా ఆకాంక్ష మాత్రమే. అన్యధా బావించకండి.
శివాజి సినిమా గురించి చాలా హంగామా జరుగుతుంది. మీకందరికీ తెలిసిందే. సినిమా చూడటానికి జనం పడే తపన, ఎంత తొందరగా చూస్తామా అన్న ఆరాటం. ఎన్నడూ లేనంతగా ఇంత ప్రచారం ఎందుకు? ఇది నిర్మాతల వ్యూహమా? సినిమా చూసిన తర్వాత జనమే చెప్తారుగా ఎలా ఉందో??ముందే ఇంత ప్రచారం చేసి జనాన్ని [...]