పుణుకులు
టపా తేదీ జూన్ 17, 2007 ద్వారా జ్యోతి
శ్యామల తన భర్త రాజ్ తో అంటుంది.
“రాజ్! మగాడి హృదయం చాలా విశాలమైంది కదా!”
“అవును డియర్! మగాడి హృదయం విశాలమైంది. అందులో ఐశ్వర్య, సుస్మిత,శ్రీదేవి, జెనిలియా,ఇలియానా, త్రిష అందరికీ చోటుంది. కాని ఎక్కువ భాగం అతడి భార్య ఆక్రమించుకుంటుంది”
“నిజమా! భార్యకు అంత చోటుందా? “
“మరే! అందుకే మగాళ్ళకే ఎక్కువ గుండె నొప్పి వచ్చేది.”
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మొదటి తరగతిలో టీచర్ పిల్లలను ప్రశ్నలడుగుతుంటుంది.
“ఒరేయ్ ప్రకాశ్! నీకు తెలిసిన ఐదు జంతువుల పేర్లు చెప్పు!”
” రెండు కుక్కలు, మూడు మేకలు మేడమ్!”
” ????????????? “
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | అభిప్రాయాలు లేవు »
