షడ్రుచుల గీతలహరి

నిన్న రాత్రి రేడియోలో పాత పాటలు వింటూ వంట చేస్తుండగా కరెంట్ హాంఫట్ అయింది. అప్పుడొచ్చిన ఈ సరదా ఐడియా…..నేను రాసే వంటలు, పాటలు కలిసి కలగా పులగం అయ్యాయి…
 
శాకాహారులకు ….
 
గోంగూర పప్పుంది  పప్పులోనా నెయ్యుంది
నెయ్యి వేసుకుని తింటుంటే
భలే రంజుగ ఉంటుంది…
ఓ..ఓ..ఓ..ఓ..హొయ్…  

// గోంగూర //

అదురు అదురుగా వేస్తుంది
పెదవులు తడిగా చేస్తుంది..
కొత్తావకాయను నెయ్యితో కలిపి జోడిస్తే
అమృతతుల్యం అవుతుంది….
 
// గోంగూర //
 
కందిపొడుంది అల్లం పచ్చడుంది
రసం ఉంది కంద ఫ్రై ఉంది
ఏది ముందు కలపాలో
తికమకలో నా మది ఉంది…
 
// గోంగూర [...]

సందడి

బ్లాగు గుంపులో బ్లాగులగురించి మాత్రమే మాట్లాడాలి.సాహిత్యం గుంపులో సాహిత్యమ్ గురించి మాత్రమే చర్చలు. మరి మిగతా విషయాలు మాట్లాడుకోవాలి , చర్చించుకోవాలి అంటే ఎలా??? దాని కోసమే  ఉంది సందడి గుంపు..ఇందులో సినిమాలు, పాటలు, అంత్యాక్షరి, పుట్టినరోజు శుభాకాంక్షలు, సరదా ఆటలు  ఎదైనా పంపండి, చర్చించండి. కాని చెత్త మెయిల్స్, అసభ్యమైనవి కాదు. ప్రకటనలు ఇవ్వరాదు. కాని ఒక్క విషయం మీరు పంపే మెయిల్స్ అన్నీ తెలుగులోనే ఉండాలి. మీదగ్గర ఇంగ్లీషులో ఉంటే తెలుగులో మార్చి పంపండి.
 రండి మరి సందడి [...]