షడ్రుచుల గీతలహరి
నిన్న రాత్రి రేడియోలో పాత పాటలు వింటూ వంట చేస్తుండగా కరెంట్ హాంఫట్ అయింది. అప్పుడొచ్చిన ఈ సరదా ఐడియా…..నేను రాసే వంటలు, పాటలు కలిసి కలగా పులగం అయ్యాయి…
శాకాహారులకు ….
గోంగూర పప్పుంది పప్పులోనా నెయ్యుంది
నెయ్యి వేసుకుని తింటుంటే
భలే రంజుగ ఉంటుంది…
ఓ..ఓ..ఓ..ఓ..హొయ్…
// గోంగూర //
అదురు అదురుగా వేస్తుంది
పెదవులు తడిగా చేస్తుంది..
కొత్తావకాయను నెయ్యితో కలిపి జోడిస్తే
అమృతతుల్యం అవుతుంది….
// గోంగూర //
కందిపొడుంది అల్లం పచ్చడుంది
రసం ఉంది కంద ఫ్రై ఉంది
ఏది ముందు కలపాలో
తికమకలో నా మది ఉంది…
// గోంగూర //
గడ్డపెరుగు నోరూరిస్తూ గిన్నెనిండా ఉంది.
గుత్తివంకాయ ఘుమఘుమలాడుతూ
ఎంత మెక్కితే అంతుంది
సువాసనతో రారమ్మని
సేమ్యా పాయసం పిలుస్తోంది.
ఆగండాగండి…మాంసాహారులకు కూడా ఉంది విందు….
భలేమంచి కూర పసందైన కూర
మసాలాతో నిండే కోడికూర
ఆ..ఆ…ఆ…
మసాలాతో నిండే కోడికూర….
// భలే మంచి //
ఇంటిలోన అందరి మనసు వంటగదికి లాగే కూర
వంటలోని ఘుమఘుమలన్నీ చుట్టుపక్కల నింపే కూర
చూడగానే నోరూరిస్తూ రమ్మని పిలిచే కూర…
// భలే మంచి //
అల్లమింత వెల్లులింత ముద్ద నూరి కూరిన కూర
లవంగాలు, దాల్చినచెక్క గుండకొట్టి కలిపిన కూర
గసగసాల కొబ్బరి పేస్టు వేసి ఘాటుఘాటుగా వండిన కూర….
// భలే మంచి //
ఎలా ఉంది….చీకటి చేసిన చిద్విలాసం….
: నందు ఉంచబడ్డది; సరదా సరదా

చాలా సరదాగా వున్నాయి, ఇటువంటివే ఇంకా వ్రాయగలరు
గోదారి గట్టు మీద గోంగూర పప్పుతో మొలిచిన చిరునవ్వు .. వసంతాలు పూచే రోజున మసాలా నిండిన కోడికూర గలగల నవ్వుల్తో గోదారి వరదైంది. ఇంకేమీ, షడ్రుచుల విందు రెండో భాగం మొదలైనట్టే!
పేరడీలు భలే అదరగొట్టారు.
పసందైన విందు అందించారు జ్యోతక్కా!