పుణుకులు - 3

ఇవాళ నేను పుణుకుల కోసం అన్నీ కలిపి పెట్టా. మీరే వేయించుకోండి కావల్సినట్టుగా..
ఒక చిన్న దీవి. అక్కడ ఒక కొబ్బరి చెట్టుపై ఒక చిన్న కోతి పిల్ల కూర్చుంది.అంతలో ఒక పెద్ద పులి దానిని
చూసి చెట్టు క్రింద కూర్చుంది అది దిగితే తినెద్దామని. అది మంచి ఆకలిగా నిద్రపోకుండా మరీ కూర్చుంది ఆ
కోతిపిల్లను తిందామని.
 
ఇప్పుడు చెప్పండి ఆ కోతిపిల్ల ఎలా తప్పించుకుంది??? 

మాతృప్రేమ

సుందరమ్మకు ముగ్గురు కొడుకులు. చదువులు కాగానే వ్యాపారాలు,ఉద్యోగలు వెతుక్కోడానికి ఇల్లొదిలి వెళ్ళారు. పదేళ్ళ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసారు.
పెద్దాడు రమేష్ అన్నాడు” నేను అమ్మకోసం పెద్ద ఇల్లు కట్టించాను”.
రెండోడు సురేష్ అన్నాడు ” నేను అమ్మకోసం మెర్సిడీస్ కారు కొన్నాను. డ్రైవరును కూడా పెట్టాను”.
చిన్నాడు హరీష్ అన్నాడు” నేను అమ్మకు ఇష్టమైనది చేసాను. మీకు తెలుసో లేదో అమ్మకు భాగవతం అంటే చాలా ఇష్టం. నేను ఒక ప్రత్యేకమైన చిలుకను లక్ష రూపాయలకు కొని దానికి పదిమంది [...]