మాతృప్రేమ

సుందరమ్మకు ముగ్గురు కొడుకులు. చదువులు కాగానే వ్యాపారాలు,ఉద్యోగలు వెతుక్కోడానికి ఇల్లొదిలి వెళ్ళారు. పదేళ్ళ తర్వాత వాళ్ళు ముగ్గురూ కలిసారు.

పెద్దాడు రమేష్ అన్నాడు” నేను అమ్మకోసం పెద్ద ఇల్లు కట్టించాను”.

రెండోడు సురేష్ అన్నాడు ” నేను అమ్మకోసం మెర్సిడీస్ కారు కొన్నాను. డ్రైవరును కూడా పెట్టాను”.

చిన్నాడు హరీష్ అన్నాడు” నేను అమ్మకు ఇష్టమైనది చేసాను. మీకు తెలుసో లేదో అమ్మకు భాగవతం అంటే చాలా ఇష్టం. నేను ఒక ప్రత్యేకమైన చిలుకను లక్ష రూపాయలకు కొని దానికి పదిమంది పండితులచేత భాగవత పద్యాలన్నీ నేర్పించాను.వారికి నెలకు లక్ష రూపాయలు ఇచ్చి.మొత్తం కోటి రూపాయల ఖర్చు ఐంది నాకు.అమ్మ ఎప్పుడు కావాలంటే అప్పుడు పుస్తకం చదవకుండానే భాగవత పద్యాలు చిలుకతో చెప్పించుకోవచ్చు”.
 

కొద్ది రోజుల తర్వాత ఆ తల్లి వివిధ దేశాలలో ఉన్న ముగ్గురికీ ఉత్తరాలు రాసింది..

“నాయనా రమేషు! నువ్వు కట్టించిన ఇల్లు బావుంది. కాని నేనుండేది ఒకే గదిలో. కాని అన్ని గదులు రోజూ శుభ్రం చేయాల్సొస్తుంది”.
 
“నాయనా సురేషు! నువ్వు పంపిన కారు బాగుంది.కాని నేను ముసలిదాన్నయ్యాను. ఎక్కడికీ వెళ్ళను. డ్రైవరు కూడా చాలా దురుసుగా మాట్లాడుతుంటాడు”.

“నాయనా హరీషు! నువ్వొక్కడివే నా ఇష్టాయిష్టాలు తెలుసుకుంటావు. నువ్వు పంపిన నాటుకోడి బావుంది. ఇగురు పెట్టా. చాలా రుచిగా ఉండింది. 

3 Responses to “మాతృప్రేమ”

  1. :-D

  2. HEHEHEEHHEEE

  3. మన సుందరమ్మ క్రమం తప్పకుండా షడ్రుచులు చదువుతుందనుకుంటాను.

Leave a Reply