సండే ఇస్పెషల్ పుణుకులు..
టపా తేదీ జూన్ 24, 2007 ద్వారా జ్యోతి
1. ఇది మీ దగ్గరుంటే పంచుకుంటారు. అప్పుడది మీ దగ్గరుండదు.
2. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత తక్కువగా కనపడుతుంది.
3. ఈ పుస్తకం పూర్వం ధనవంతుల దగ్గరే ఉండేది. ఇప్పుదు చాలా మంది దగ్గరుంటుంది. ఈ పుస్తక0
ఎక్కడాకొనలేము అద్దెకు కూడా తెచ్చుకోలేము.
4. ఇది ఒక తినుబండారం. కాని దీనికి మొదలు లేదు, అంతం లేదు, మధ్యమం కూడా లేదు..
5. ఇది ఉపయోగించాలంటే పగలగొట్టాల్సిందే.
6. ఎప్పుడూ పెరిగేదే కాని తరిగేది కాదు..
7.. ఒక మగాడు తన విధవ భార్య చెల్లెల్లిని పెళ్ళి చేసుకోవాలనుకుంటాడు. ఎప్పుడు చేసుకుంటాడు..
8. నారి లేని నారి ఎవరు….
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు

?????????
1. బాధ?
2. జ్ఞానం (ఇది పెరిగే కొద్దీ వినయం పెరుగుతుంది కదా? అందుకన్నమాట)
3. ?
4. పాయసం?
5. కొబ్బరికాయ
6. వయసు
7. వచ్చే జన్మలో (అప్పటికే తన భార్య విధవ అయింది..అంటే తను చచ్చిపోయాడు కాబట్టి)
8. నారి (అల్లెత్రాటి రాపిడి వల్ల మొద్దుబారిన అరచేతిలో కాచే కాయ) లేని నారి (స్త్రీ): చాలామంది
1. రహస్యం
2. చీకటి
3. టెలిఫోన్ డైరెక్టరీ
4. చిల్లు గారె లేక డోనట్
5. గ్రుడ్డు
6. వయసు
7. వచ్చే జన్మలో…అతను చనిపోయాడు కాబట్టి
8. పిసినారి
chala bagunnayi