టపా తేదీ జూన్ 27, 2007 ద్వారా జ్యోతి
మొన్న ఆదివారం నేను పిల్లలు కూర్చుని ఎవరి పని వాళ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము. అంటే వాళ్ళు ఎదో చదువుకుంటున్నారు. నేను కుట్టుకుంటున్నాను. నేనడిగా శివాజి సంగతేమయ్యింది. క్రిందటి వారం ఎవ్వరు చూసినా అదే ముచ్చట. వారం దాటగానే చడి చప్పుడు లేదు. “ప్చ్” అన్నాడు మా అబ్బాయి. ” శివాజీలో ఇతివృత్తం బావుంది. కాని ప్రెజెంటేషన్ మరీ టూమచ ఐంది. పాటలు, దుస్తులకే ఎక్కువ ఖర్చు పెట్టారు.”అంది మా అమ్మాయి. నేనన్నా “అసలు ఖర్చు పెట్టి సినిమా [...]
: నందు ఉంచబడ్డది; సరదా సరదా | 1 అభిప్రాయం »
టపా తేదీ జూన్ 27, 2007 ద్వారా జ్యోతి
తెలుగు నిఘంటువులు చాలా వచ్చాయి. అయితే అన్నింటిలోనూ గ్రాంధిక, కావ్యభాషా పదాలే అధికంగా వుంటాయి. ప్రత్యేక నిఘంటువులు, పదకోశాల్లో పారిభాషిక పదజాలానికి, వృత్తి సంబంధమైన పదాలకు, పద బంధాలకూ కూడా అర్ధాలుదొరుకుతాయి. నానార్ధ పదకోశాలు, పర్యాయపద నిఘంటువులు,మాండలిక పద నిఘంటువులు, వృత్తికోశాలు, పాత్రికేయ పదకోశాలు ఈ కోవకు చెందుతాయి. కాని వాడుక తెలుగును వీటి నుంచి ఆశించలేం. అది నిజంగా పెద్ద లోటే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి వాడుక తెలుగు కోశాన్ని రూపొందించారు. [...]
: నందు ఉంచబడ్డది; పుస్తకాలు | 2 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జూన్ 27, 2007 ద్వారా జ్యోతి
ఎవరీ లింగం మావ అనుకుంటున్నారా!!..అదేనండి సర్దార్జీ ..అలా ఒక వర్గం వారిని హేళన చేయడం బావుండదని ఇలా ఒక ప్రత్యేక పాత్రను తయారు చేసాను.
ఒక రోజు సాయంత్రం లింగం మావ తన స్నేహితుడితో కలిసి టీ.వీలో వార్తలు చూస్తున్నాడు. అప్పుడు వార్తలలో ఒక వ్యక్తి వాటర్ ట్యాంక్ ఎక్కి చస్తానని బెదిరించే సీను చూపెట్టసాగారు. అప్పుడు స్నేహితుడు ” ఆ వ్యక్తి తప్పకుండా దూకేస్తాడు చూడు!” …లింగం మావ మాత్రం ” ఏం కాదు. ప్రాణమంటే ఎవడికి [...]
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 1 అభిప్రాయం »
టపా తేదీ జూన్ 27, 2007 ద్వారా జ్యోతి
అదో కూడలి..అక్కడ ఓ ఇంటి గోడపై కూర్చుని నాలుగు రౌడీ చీమలు వచ్చేపోయే వారిని అల్లరి పెడుతున్నాయి. అంతలో ఒక ఏనుగు అలా రోడ్డుపై వెళుతుంది.
అప్పుడు ఒక చీమ…” నిలువవే వాలు కనుల దానా! వయ్యారి హంస నడక దానా!” అని పాట పాడసాగింది.
ఇంకో చీమ…”మామా! పిల్ల పిట పిట లాడుతుందిరా! ఏం ఫిగర్ రా! 360..240..360..”
రెండు చీమలు బాగా తాగి రోడ్డుపై తూలుకుంటూ వెళుతున్నాయి. ఎదురుగా ఒక ఏనుగు వస్తుంది.
అప్పుడొక చీమ “రారా [...]
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 1 అభిప్రాయం »
టపా తేదీ జూన్ 27, 2007 ద్వారా జ్యోతి
ఈ తాజ్‍మహల్ గొడవేంటి బాబు!! ఎస్.ఎమ్.ఎస్ లు చేయమంటారు. ఫోన్లు చేయమంటారు..అసలు ప్రపంచంలో ఏడు వింతలే ఎందుకు? ఎక్కువ ఉండకూడదా?. కొత్త కొత్త వింతలు ఎన్నో పుట్టుకొస్తుంటాయి.. మన తాజ్‍మహల్‍ను ఆ వింతలలో నిలబెట్టడానికి ఇంత బలవంత తాపత్రయం ఏంటంట. రేడియోలలో,టీ.వీ ప్రోగ్రాములలో ఇప్పటికే ఎస్.ఎమ్.ఎస్ ల గోలతో తల వాచిపోతుంది. ఇప్పుడు ఈ తాజ్‍మహల్ కోసం..
అసలు తాజ్‍మహల్ ఆ ఏడు వింతలలో లేకపోతే మునిగిపోయేది ఏంటంట? వింత కాకుంటే జనం తాజ్ ను చూడటానికి [...]
: నందు ఉంచబడ్డది; general | 3 వ్యాఖ్యానాలు »