సినిమా కథాశ్రవణం
రాసినది జ్యోతి పై జూన్ 27, 2007
మొన్న ఆదివారం నేను పిల్లలు కూర్చుని ఎవరి పని వాళ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము. అంటే వాళ్ళు ఎదో చదువుకుంటున్నారు. నేను కుట్టుకుంటున్నాను. నేనడిగా శివాజి సంగతేమయ్యింది. క్రిందటి వారం ఎవ్వరు చూసినా అదే ముచ్చట. వారం దాటగానే చడి చప్పుడు లేదు. “ప్చ్” అన్నాడు మా అబ్బాయి. ” శివాజీలో ఇతివృత్తం బావుంది. కాని ప్రెజెంటేషన్ మరీ టూమచ ఐంది. పాటలు, దుస్తులకే ఎక్కువ ఖర్చు పెట్టారు.”అంది మా అమ్మాయి. నేనన్నా “అసలు ఖర్చు పెట్టి సినిమా తీసారంటే హిందీ దేవదాసునే అందులో పాటలు, యాక్షన్, సెట్టింగ్స్ చాలా బావున్నాయి. అందుకే అది పెద్ద హిట్ అయింది ” అని నేనన్నా ..అప్పుడు మా అబ్బాయి అసలు ఆ దేవదాసు సినిమా స్టోరీ ఏంటీ!. అందరికి ఎందుకు నచ్చింది. పాతది కూడా వుందంట కదా అని అడిగితే నేను ఆ సినిమా స్టోరీ ఇలా చెప్పాను మాడర్న్ స్టయిల్ లో వాళ్ళకు అర్ధం కావాలి అని.
దేవదాసు, పార్వతి చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్. దేవదాసు ఊర్లో చదవటంలేదని వాళ్ళ డాడీ సిటీకి పంపిస్తాడు హాస్టల్‍లో ఉండి చదవాలని. దేవదాసు పెద్దయి చదువు కంప్లీట్ చేసి గుర్రం బండి (అప్పుడు బైకులు లేవు మరి) మీద పాట పాడుకుంటూ ఊరికొస్తాడు. పార్వతిలో కలిసి తర్వాత లవ్ చేసుకుంటారు. కాని దేవదాసు డాడి చాలా రిచ్ , పార్వతి వాళ్ళు మిడిల్ క్లాస్ అందుకే పెళ్ళి కి ఒప్పుకోరు. పార్వతిని ఒక రిచ్ ముసలివాడికి ఇచ్చి పెళ్ళి చేస్తారు. వాడికి పార్వతి కంటే పెద్ద పిల్లలు ఉంటారు. ఇది తెలుసుకొని దేవదాసు “పారూ>>>>>>>>” అంటు మందు కొడుతూ డ్యాన్సులకెల్తుంటాడు(ఇప్పటి పబ్‍ల లాంటివి అన్నమాట).అలా నీళ్ళకంటే ఎక్కువ తాగితే ఏమవుతుంది. చావడానికి దగ్గరయ్యాడు. అప్పుడు కష్టపడి, ట్రైన్ ఎక్కి ,దగ్గుతూ మళ్ళీ పాట పాడుతూ పార్వతి ఊరికొచ్చి బండి మీద వాళ్ళింటికి వస్తాడు. అది తెలుసుకొని పార్వతి “దేవదా!!” అంటూ గేటు దగ్గరకు పరిగెత్తుకొస్తుంది. పార్వతి హస్బెండ్ అది చూసి గేటేయిస్తాడు. అంతే గేటవతల దేవదాసు, గేటివతల పార్వతి ఢామ్మంటు పడిపోతారు. సినిమా ఏండ్…
ఇందుకో స్పెషల్ ఏంటంటే…. ఏమీ లేదు. పాటలు అంతే ..ఏడిచినా కూడా సూపర్ పాటలు వస్తాయి మరి సినిమాలలో
అదే దేవదాసు మళ్లీ పుట్టాడంటూ ఇంకో సినిమా వచ్చింది. అదే ఏ.ఎన్.ఆర్. సావిత్రి, సేమ్ రోల్స్…కాని ఈ సినిమా చూస్తే కాని తెలియదు దేవదాసు ఒక్కడే ఔటయ్యాడు. పార్వతి బ్రతికే ఉంది అని. దేవదాసు మళ్ళీ పుట్టి, మళ్ళీ పుట్టిన గత జన్మలో డాన్సర్ ఫ్రెండ్ని ప్రేమిస్తాడు. దేవదాస్,పార్వతి ఎదురుపడతారు. అక్కడో సీను. పార్వతి దేవదాసుకి వాడి గర్ల్‍ఫ్రెండ్‍తో పెళ్ళి చేయిస్తుంది. అంతె సినిమా ఎండ్…..
ఎలా ఉంది మన సినిమా సమీక్ష…పిల్లలైతే ఒకటే నవ్వు.
radhika చెప్పబడిన
అదరగొట్టారు.అక్కడ దేవదాసు దగ్గి దగ్గి చస్తే నేను నవ్వి నవ్వి చచ్చేలా వున్నాను.