చెప్పుకోండి చూద్దాం…
రాసినది జ్యోతి పై జూన్ 28, 2007
అనగనగా ఒక వ్యక్తి అడవిలో తప్పిపోయాడు. అతడిని జింగారో జాతి మనుష్యులు ఎత్తుకెళ్ళారు. అతడిని చెట్టుకు కట్టేసారు. వాళ్ళూ నరమాంస భక్షకులు..ఏడుస్తున్న అతడిని చూసి వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుని ఇలా అన్నారు.
“ఓరేయ్! నువ్వు మాకు ఎదైనా ఒక విషయం చెప్పు. అది నిజమైతే నిన్ను ఉడకేసుకు తింటాము. అబద్ధమైతే వేపుడు చేసుకు తింటాము” అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పి తప్పించుకున్నాడు.
????????????
Kamesh చెప్పబడిన
nannu meeru ippudu vepudu chesukoni tintaaru ani cheptaadu
విహారి చెప్పబడిన
“జగనన్న మా అన్న తెలుసా” అన్నాడు.
అంతే ఖేల్ ఖతం.
విహారి
http://vihaari.blogspot.com
విశ్వనాధ్ చెప్పబడిన
ఒకే ఒక మాట.
క్షణాల్లో ఒక్కడందరూ మటుమాయం.
అది……నాకు!!! ఎయిడ్స్.
లోకేష్ చెప్పబడిన
మీరు ఇప్పుడు నన్ను ఉడకేసుకొని తింటారు అని చెప్పి ఉంటాడు..ఒక వేళ వాడికి నా అంత తెలివెగన ఉంటే….