jyothi

నవ్వితే హ్యాపీ, నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి…నవ్వండి నవ్వించండి

ఘల్లు ఘల్లు సెల్లు….

రాసినది జ్యోతి పై జూన్ 29, 2007

 

ఈ హైటెక్ యుగంలో

 

సెల్ఈజ్ మోస్ట్ పవర్‍ఫుల్లు

వితౌట్ సెల్, లైఫే నిల్లు

ఎంతటివారైనా సెల్లుకు మోకరిల్లు

గుప్పెడు సెల్లు

ఇస్తుంది బోలెడు థ్రిల్లు

బిల్లు వచ్చాక గుండె జల్లు

సెల్లు చేతిలో ఉంటే చాలు

తిరిగినట్టే తెలీదు గడియారపు ముల్లు

బోరుఅనే మాటకిక చెల్లు

రింగ్‍టోన్‍తో సంగీతాన్ని సైతం వెదజల్లు

 

మితిమీరి వాడితే మాత్రం

 

అతిగా వస్తుంది బిల్లు

జేబుకు పడుతుంది చిల్లు

దాంతో తిరుగుతాయి కళ్ళు

అందుకే ఆచీ తూచీ వాడాలి సెల్లు

వాడేటప్పుడు దగ్గరుండాలి ఒళ్ళు..

ఒక స్పందన కు “ఘల్లు ఘల్లు సెల్లు….”

  1. Raghuram చెప్పబడిన

    మీ కవిత అమ్మాయిలకి బాగా సరిపోతుంది. అబ్బాయిలు అంతగా సెల్ వాడరు లెండి.

ప్రత్యుత్తరమిమ్ము

XHTML: మీరు ఈ తోకలు ఉపయోగించవచ్చు : <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>