చెప్పుకోండి చూద్దాం…

 
అనగనగా ఒక వ్యక్తి అడవిలో తప్పిపోయాడు. అతడిని జింగారో జాతి మనుష్యులు ఎత్తుకెళ్ళారు. అతడిని చెట్టుకు కట్టేసారు. వాళ్ళూ నరమాంస భక్షకులు..ఏడుస్తున్న అతడిని చూసి వాళ్లలో వాళ్ళే మాట్లాడుకుని ఇలా అన్నారు.

“ఓరేయ్! నువ్వు మాకు ఎదైనా ఒక విషయం చెప్పు. అది నిజమైతే నిన్ను ఉడకేసుకు తింటాము. అబద్ధమైతే వేపుడు చేసుకు తింటాము” అని చెప్పారు. అప్పుడు ఆ వ్యక్తి వాళ్ళతో ఏం చెప్పి తప్పించుకున్నాడు.

????????????

ఆదాబర్సే…..

                        
 
ఇది హైదరబాదీయుల మధురమైన భాష. వినడానికి తికమకగా ఉన్నా ఎంతో ఆత్మీయంగా ఉంటుంది. ఇందులో హిందీ , ఉర్దూ కలగలసి ఉంటుంది…

 
యహీచ్ హై :  ( ఇక్కడే ఉంది ). హైదరాబాదులో ముఖ్యంగా పాతబస్తీలో దారికోసం ఎవ్వరినడిగినా తెలీదు అనరు . యహీచ్ హై సీదా జాకే దాయే ముడ్‍నా( ఇక్కడే ఉంది. నేరుగా వెళ్ళి కుడివైపుకి తిరుగు) అని చెప్తారు . ఆ స్థలం కిలోమీటర్ దూరంలో ఉన్నా సరే అది సందు మూలలోనే [...]

కప్ప వైద్యుడు

 
ఇది పాతికేళ్ళ క్రిందటి ఆంధ్రజ్యోతి వారపత్రికలో ప్రచురించబడింది. ఎవరు రాసారో తెలీదు మరి….
 
అనగనగా ఒక కప్ప
అది తానొక గొప్ప
వైద్యుడని భావించింది
వైద్యం చేస్తానని చాటించింది.
 
అడవికి వెళ్ళిందా కప్ప
అమాంతంగా ఒక గొప్ప
వైద్యుడైనట్టు తన మెప్పు
చాటింది (బెక బెకల డప్పు).
 
అరణ్యమృగాలీ చోద్యం
చూశాయి “సెబాస్, వైద్యం
చేసే తమాషా కప్ప
ఎక్కడా చూడలేదప్ప!”
అనుకున్నాయి జంతువులు పాపం.
 
“నిజంగా ఈ కప్పరూపం
ధరించిన వైద్యు“డని మృగాలు
నమ్మాయి కప్పగప్పాలు!
అయితే ఒక నక్క మాత్రం
’కప్పేమిటి? వైద్యమేమిటి?’ చిత్రం
ఇందులో ఎదో మోసం
ఉండాలి ముప్పాతిక మువ్వీసం!’
అనుకుని వెళ్ళింది కప్ప
దగ్గరికి నక్క ఒక పెంటకుప్ప
కన్నా అసహ్యంగా ఉన్న
ఈ [...]

సినిమా కథాశ్రవణం

 
మొన్న ఆదివారం నేను పిల్లలు కూర్చుని ఎవరి పని వాళ్లు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నాము. అంటే వాళ్ళు ఎదో చదువుకుంటున్నారు. నేను కుట్టుకుంటున్నాను. నేనడిగా శివాజి సంగతేమయ్యింది. క్రిందటి వారం ఎవ్వరు చూసినా అదే ముచ్చట. వారం దాటగానే చడి చప్పుడు లేదు. “ప్చ్” అన్నాడు మా అబ్బాయి.  ” శివాజీలో ఇతివృత్తం బావుంది. కాని ప్రెజెంటేషన్ మరీ టూమచ ఐంది. పాటలు, దుస్తులకే ఎక్కువ ఖర్చు పెట్టారు.”అంది మా అమ్మాయి. నేనన్నా “అసలు ఖర్చు పెట్టి సినిమా [...]

పుస్తక పరిచయం

తెలుగు నిఘంటువులు చాలా వచ్చాయి. అయితే అన్నింటిలోనూ గ్రాంధిక, కావ్యభాషా పదాలే అధికంగా వుంటాయి. ప్రత్యేక నిఘంటువులు, పదకోశాల్లో పారిభాషిక పదజాలానికి, వృత్తి సంబంధమైన పదాలకు, పద బంధాలకూ కూడా అర్ధాలుదొరుకుతాయి. నానార్ధ పదకోశాలు, పర్యాయపద నిఘంటువులు,మాండలిక పద నిఘంటువులు, వృత్తికోశాలు, పాత్రికేయ పదకోశాలు ఈ కోవకు చెందుతాయి. కాని వాడుక తెలుగును వీటి నుంచి ఆశించలేం.  అది నిజంగా పెద్ద లోటే. దీనిని దృష్టిలో పెట్టుకుని ఆచార్య కేతు విశ్వనాధరెడ్డి వాడుక తెలుగు కోశాన్ని రూపొందించారు. [...]