టపా తేదీ జులై 24, 2007 ద్వారా జ్యోతి
అనగనగనగా ఒక రాజు ..
ఆ రాజుకు నలుగురు కొడుకులు…
రామరాజు
సోమరాజు
భీమరాజు
బక్కరాజు…
వీరిలో ఒక్కొక్క రాకుమారుడికి చదువులో ఒక్కో సబ్జెక్ట్ అంటే చాలా
ఇష్టం. ఎప్పుడూ అదే సబ్జెక్ట్ చదవడానికి ఇష్టపడతారు…
ఇందులో ఇంగ్లీషులో ఆలోచించే రాజు ఎవరు?????
ఎవరు??
ఎవరు??
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 6 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 24, 2007 ద్వారా జ్యోతి
1. అసలైన మగతనమంటే ఏమిటి? నిజమైన ధైర్యసాహసి ఎవరు???
అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడ్డ
భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా?
కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనడం…
2. అందమైన అమ్మాయి కాలేజీకి నడుచుకుంటూ వెళుతుంది. దారిలో ఒక
ముసలావిడ రోడ్డు దాటదానికి ప్రయత్నిస్తుంటే ఆమె చేయి పట్టుకుని
జాగ్రత్తగా రోడ్డు దాటిస్తూ ఉంటుంది. ఇంతలో ట్రాఫిక్ కానిస్టేబుల్ విజిల్
వేసాడు. అప్పుడు ఆ అందమైన అమ్మాయి మాత్రమే వెనక్కి తిరిగి [...]
: నందు ఉంచబడ్డది; హాస్యపుణుకులు | 4 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 23, 2007 ద్వారా జ్యోతి
ఇది నిజంగా జరిగిన కథ…
రామశర్మగారు భారత, భాగవతాలు క్షుణ్ణంగా చదివినవాడు.అతని కొడుకు
కులాంతర వివాహం చేసుకున్నాడు. అలా చేయడం వల్ల శర్మగారి
తండ్రులు,తాతలు,ముత్తాతలు, వారి తాతలు అందరికీ దోషం కలుగుతుంది .. ఈ
విషయం భాగవతంలో స్పష్టంగా ఉందని ఆయన అభిప్రాయం.అందువల్ల తన
కుమారుడు తన అంత్య క్రియలు చేయడం ఇష్టం లేదు.
నా సందేహం ఏంటంటే??
కులాంతర వివాహం చేసుకుంటే తాతలు,ముత్తాతలకు దోషమని చెప్పిన
భాగవతంలో శ్రీకృష్ణుడు అన్ని కులాల కన్యలను భార్యలుగా చేసుకున్నాడు అని
కూడా ఉందిగా. [...]
: నందు ఉంచబడ్డది; నా మనోభావాలు | 7 వ్యాఖ్యానాలు »
టపా తేదీ జులై 23, 2007 ద్వారా జ్యోతి
అంకెలతో సాహిత్యానికి చాలా సంబంధం ఉంది. (ఈ మహా సృష్టిని అంకెల ఆధారంతోనే గుర్తిస్తాము.) జ్ఞానానికి సంఖ్య ఆధారం. కాని అంకెకు ప్రత్యేక అస్థిత్వమంటూ లేదు. అసలు అంకెల ఆధారిత పేర్లు, పదబంధాలు ఎన్నో ఉన్నాయి. ఏకావ్రతుడు, త్రివిక్రముడు,చతుర్ముఖుడు, పాంచాలి, సప్తాశ్వుడు, అష్టావక్రుడు, నవనాధుడు, దశకంఠుడు మొదలైనవి. మన కవులు కవితలల్లడానికి ఇదీ అని ఒక వస్తువు కాని, విషయం కాని ఆలోచించరు. కనపడ్డ ప్రతి దానిపై చమత్కార పద్యాలల్లగల ధీమంతులు.
ఆద్యుడున్న యప్పు డందరు పూజ్యులే
లెక్క మీద [...]
: నందు ఉంచబడ్డది; పొద్దు రచనలు | అభిప్రాయాలు లేవు »
టపా తేదీ జులై 23, 2007 ద్వారా జ్యోతి
వేసవి సెలవులు. పిల్లలందరూ అందరి ఇళ్ళలో గోల గోల చేస్తున్నారు. ఓ రోజు మా కాలనీలో ఒక విచిత్రమైన పోటి పెట్టారు. ఒక ఖాళీ గ్యాస్ సిలిండరు తెచ్చి పెట్టి అందరిని తాము కోసిన కోతలుగానీ,చెప్పిన అబద్ధాలు , బడాయిలు, కొట్టిన గ్యాసు కాని చెప్పమన్నారు. ఇది విచిత్రమైన సిలిండరట. ఇలా చెప్పిన గ్యాసుతో మెల్లిగా నిండుతుందంట. ఎవరైతే ఎక్కువ, అదరగొట్టే గ్యాస్ కొడతారో,లేదా కోతలు కోస్తారో వారికే ఈ సిలిండరు ఇవ్వబడుతుంది. అది ఖాళీ అయ్యాక [...]
: నందు ఉంచబడ్డది; పొద్దు రచనలు | అభిప్రాయాలు లేవు »