ఇల్లాలు - ఇంటర్నెట్

                                                   
గతవారం బెంగుళూరు బ్లాగర్ల సమావేశంలో అంతర్జాలంలో గృహిణులు తమ సమయాన్ని ఎలా సద్వినియోగపరుచుకోగలరో చర్చించారు మన మిత్రులు.
ఈ రోజుల్లో అందరు మహిళలు చదువుకునే ఉంటున్నారు. పెళ్ళయ్యాక పిల్లలు , ఇంటి భాధ్యతలు అంటూ తమ చదువు, తమ అభిరుచులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు. భర్త సంపాదిస్తున్నాడుగా మేమేం చేయాలి అని. ఉద్యోగాలు చేసేవారు వేరే. నేను చెప్పేది ఇంట్లో ఉండే గృహిణుల గురించి. భర్త, పిల్లలు ఆఫీసులకు స్కూళ్ళకు వెళ్ళిపోయాక ఇంటి పని తీర్చుకుని కాస్త కునుకేసి [...]