అమీ -తుమీ..
రాసినది జ్యోతి పై ఆగష్టు 13, 2007
ఆమీ తుమీ తేల్చుకుందాం రా….
ఈ జాతీయంలో అమీ తుమీ అనేది ఏ భాషా పదం. అది తెలుగులా లేదే!!. మరి ఎక్కడినుండి వచ్చింది. దాన్ని అలాగే ఎందుకు వాడుతున్నారు.??
అమీ అంటే నేను
తుమీ అంటే నువ్వు
అసలు పదం సంస్కృతంలోనిది
అహం – నేను
త్వం _ నువ్వు
అది వెళ్ళి బంగ్లా భాషలో అమీ తుమీ అయ్యింది.
అలాగే వచ్చి తెలుగులో కూడా అమీ తుమీ తేల్చుకుందాం అయింది. అంటే నువ్వా నేనా తేల్చుకుందాం అని.
ఇది ఈటీవీ౨ లో వచ్చిన తెలుగువెలుగులో వచ్చింది.
వెంకట రమణ చెప్పబడిన
జ్యోతిగారు,
ఇలా అంటున్నానని ఏమీ అనుకోవద్దు. మీరు ఈ విషయాన్ని మొన్న ఆదివారం ETV2లో వచ్చిన తెలుగు-వెలుగు కార్యక్రమం ద్వారా కనుక తెలుసుకొని ఉంటే అలా తెలుసుకొన్నాను అని వ్రాయడం ఒక మంచి పద్దతి.
జ్యోతి చెప్పబడిన
సారీ …ఇప్పుడు రాసేసా. బావుందని రాసా కాని మూలం రాయకపోవడం తప్పే.
budugu చెప్పబడిన
అరవ సాంబారు జెమిని/తేజ టివి కి అచ్చ తెలుగు ఈటివి2 ఇదే తేడా…
తెలుగుఅభిమాని చెప్పబడిన
బుడుగుగారు– కానీ అచ్చతెలుగు ఈ టీవీ అంతర్గత పురస్కారాలు (internal awards) విభాగాలు చూడండి — best actor, best supporting actor వగైరా వగైరా ..ఉత్తమ నటుడు, నటి, సహాయనటుడు –ఇవి ఎందుకు వాడకూడదు. ఇక tv9 సంగతి చెప్పనక్కర్లేదు. వారికి ఆంగ్లపదాలే ఊపిరి.
తెలుగుఅభిమాని చెప్పబడిన
జ్యోతిగారు–కీ.శే. బూదరాజు రాధా కృష్ణ గారు రాసిన ’తెలుగు జాతీయాలు’ అనే పుస్తకంలో ఇలాంటి తెలుగు జాతీయాల వివరణ చక్కగా ఉంది.
జ్యోతి చెప్పబడిన
ధన్యవాదములు తెలుగు అభిమానిగారు. చాలా రోజులనుండి అనుకుంటున్నాను ఇలాంటి సామెతలు, జాతీయాలు వివరణలు ఉన్న పుస్తకం కోసం. త్వరలో కొనుక్కుంటాను.
Giri చెప్పబడిన
మూలాలు వ్రాయకపోవడం మీకు బాగా అలవాటేగా…keep going