యధార్ధ గాధ…

ఒక యధార్ధ గాధ. చెప్పనా..
నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి జీవితంలోని యధార్ధ గాధను మీకు
చెప్పాలనుకుంటున్నాను. అతను ఎదుర్కొన్న సమస్యలలో కొన్ని
మనకూ ఎదురై ఉండవచ్చు. కాని మృతువు అంచుల దాకా వెళ్ళి
తిరిగి వచ్చి తన ధృడ సంకల్పముతో అనారోగ్యముతో పోరాడుతూనే
అతి పిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని,
ఆంధ్రదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది
గౌరవింపబడుతున్న వ్యక్తి జీవిత సత్యమిది.
ముందుగా అతను తన కథను చెప్పలేదు. కాని మాటల సంధర్భములో బలవంతం పెడితే నాకు చెప్పిన కథను నా [...]

ఆరోగ్యమే మహాభాగ్యం…

లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజయ్. ఆ డాక్టర్ అదో టైపు.
సంజయ్ : సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
డాక్టర్: ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే.
సం: వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
డా. ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
సం: వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
డా: అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి [...]