యదార్ధ గాధ…

నల్లమోతు శ్రీధర్ స్వగతం…
 
 
 
ఈ రోజు నల్లమోతు శ్రీధర్ గా రాష్ట్రంలోని చాలా మందికి సుపరిచితమైన నేను ఎప్పటికీ నా గతం ఇతరులకు వెల్లడించకూడదని అనుకుంటూ వచ్చాను. కాని ఆలోచిస్తుంటే నా గతం తెలుసుకుంటే దాన్ని చదివిన ఒకరిద్దరికైనా ప్రేరణ కలగవచ్చన్న ఆశతో దీన్ని రాయడానికి పూనుకున్నాను. ఇక్కడ నేను రాసిన ప్రతీ అంశం అహంకారం, స్వీయ సానుభూతి, గొప్పలు చెప్పుకోవడం. వంటి మానసిక ప్రలోభాలకు అతీతంగా నా మనసుని స్థిరీకరించుకుని రాస్తున్నదే. కొందరికైనా స్పూర్తిదాయకంగా ఉంటుందని వ్యక్తపరుస్తున్నదే [...]

జన్మదిన శుభాకాంక్షలు చేతన్…

                   
HAPPY BIRTHDAY TO KRISHNACHAITANYA..
ఈరోజు మా అబ్బాయి కృష్ణచైతన్య పుట్టినరోజు. నీ బ్లాగులో అందరికీ
విషెస్ చెప్తావ్. నాకు చెప్పవా అంటే ఇలా చెప్తున్నా. మీ అందరి
ఆశీర్వాదాలు ఇవ్వండి.నెల క్రిందే విప్రోలో ఉద్యోగంలో చేరాడు వాడు.
ఆ కృష్ణుడిలాగే  మావాడు అల్లరి ఎక్కువే చిన్నప్పటి నుండి…

యధార్ధ గాధ…

ఒక యధార్ధ గాధ. చెప్పనా..
నాకు తెలిసిన ఒక మంచి వ్యక్తి జీవితంలోని యధార్ధ గాధను మీకు
చెప్పాలనుకుంటున్నాను. అతను ఎదుర్కొన్న సమస్యలలో కొన్ని
మనకూ ఎదురై ఉండవచ్చు. కాని మృతువు అంచుల దాకా వెళ్ళి
తిరిగి వచ్చి తన ధృడ సంకల్పముతో అనారోగ్యముతో పోరాడుతూనే
అతి పిన్న వయసులోనే ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని,
ఆంధ్రదేశంలోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొంది
గౌరవింపబడుతున్న వ్యక్తి జీవిత సత్యమిది.
ముందుగా అతను తన కథను చెప్పలేదు. కాని మాటల సంధర్భములో బలవంతం పెడితే నాకు చెప్పిన కథను నా [...]

ఆరోగ్యమే మహాభాగ్యం…

లావు తగ్గాలని డైటీషియన్‌ని కలిసాడు సంజయ్. ఆ డాక్టర్ అదో టైపు.
సంజయ్ : సన్నబడాలంటే మాంసం తగ్గించి, ఆకు కూరలు, ధాన్యాలు బాగా తినాలంటారు .. నిజమేనా?
డాక్టర్: ఏమక్కరలేదు, మేకలు, గొర్రెలు తినేదేమిటి. ఆకులు, గడ్డే కదా. కోళ్ళకు దాణానే కదా వేస్తున్నాం. మాంసం తింటున్నామంటే పరోక్షంగా ఆకుకూరలు, ధాన్యాలు తింటున్నట్లే.
సం: వేపుళ్ళు మంచివి కావంటుంటారు..
డా. ఎందుక్కావు? నూనె ఎక్కడినుండి వచ్చింది?
సం: వేరుశనగ, నువ్వులు, పొద్దుతిరుగుడు.
డా: అంటే ధాన్యాల నుంచే కదా, మరి నీ ఒంటికి అవి [...]

అందరికీ ధన్యవాదములు…

                 
నేను మొదటి సారి రాసిన వ్యాసం అందరికీ నచ్చినందుకు , నన్ను అభినందించినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదములు.
నేను వెయ్యి టపాలు పూర్తి చేసి విక్షనరీ, తెవికీ పనులు చేసుకుందాము హాయిగా అనుకుని బ్రేక్ తీసుకున్నా. కాని అనుకోకుండా నల్లమోతు శ్రీధర్ గారు మన బ్లాగు గుంపులోకి రావడం,ఆయనని బ్లాగు మొదలెట్టమనడం జరిగింది. మామూలుగా నేను వికీ పని చేసుకుంటూ ఉండగా, ఒక రోజు శ్రీధర్ గారు ఏమనుకున్నారో ఏమో తను రాయాలనుకున్న బ్లాగుల గురించి వ్యాసం [...]