Archive for అక్టోబర్ 9th, 2007
పెళ్ళైనవారికి మాత్రమే..
భార్య పుట్టినరోజు, తమ పెళ్ళిరోజు మొగుళ్ళకి గుర్తుండదు. ఎందుకు??
ఇది నా ఒక్కదాని సమస్యే , మావారికి మాత్రమే ఈ రోజులు గుర్తుండవు. నా రాత ఇంతే అనుకున్నా ఇన్ని ఏళ్ళు. కాని మొన్న వరూధినిగారి పుట్టినరోజునాడు తెలిసింది ఇలాంటి మొగుడు మహారాజులు కోకొల్లలు అని.
ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలని జరిపింది పెళ్ళి. అది ప్రతిసంవత్సరం జరుపుకోవడానికి అంత నిర్లక్ష్యం ఏమిటి. ఈ మొగుళ్ళకి. భార్య పుట్టినరోజు గుర్తుంచుకుని ఆ రోజు తనని ప్రత్యేకంగా అభినందించి, [...]
పుణుకులు
మగ చెవి – ఆడ నాలుక
ఒక ప్రమాదంలో రెండు చెవులనూ పోగొట్టుకుంది సుందరి. శస్త్ర చికిత్స చేసి ఆమెకు కొత్త చెవులను అమర్చాడు డాక్టరు.
వారం తర్వాత సుందరి ఆ డాక్టరు దగ్గరకెళ్ళి ” నాకు పెట్టిన చెవులు మగవాళ్ళవి” అంది కోపంగా.
“అయితే ఏమయింది? చెవులు ఎవరివైనా చెవులేకదా! సరిగా వినపడాలి గాని! ” అన్నాడు డాక్టరు.
“అలా ఎలా అవుతాయి? ఎదుటివాళ్ళు చెప్పినవన్నీ నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాని ఒక్కటీ చెయ్యబుద్ధి కావట్లేదు” అని వాపోయింది సుందరి.
అదే [...]


