పుణుకులు

 

                         మగ చెవి - ఆడ నాలుక

 

ఒక ప్రమాదంలో రెండు చెవులనూ పోగొట్టుకుంది సుందరి. శస్త్ర చికిత్స చేసి ఆమెకు కొత్త చెవులను అమర్చాడు డాక్టరు.

 

వారం తర్వాత సుందరి ఆ డాక్టరు దగ్గరకెళ్ళి నాకు పెట్టిన చెవులు మగవాళ్ళవిఅంది కోపంగా.

 

అయితే ఏమయింది? చెవులు ఎవరివైనా చెవులేకదా! సరిగా వినపడాలి గాని! ” అన్నాడు డాక్టరు.

 

అలా ఎలా అవుతాయి? ఎదుటివాళ్ళు చెప్పినవన్నీ నాకు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కాని ఒక్కటీ చెయ్యబుద్ధి కావట్లేదుఅని వాపోయింది సుందరి.

 

అదే ప్రమదంలో తన  నాలుకను పోగొట్టుకున్నాడు సుబ్బారావు. అతనికి శస్త్రచికిత్స చేసి కొత్త నాలుకను అమర్చాడు అదే డాక్టరు.

 

వారం తర్వాత నాకు ఆడవాళ్ళ నాలుక ఎందుకు అమర్చారు?” అని డాక్టరు మీద కేకలేసాడు సుబ్బారావు.

 

అయితే ఏమయింది? నాలుక ఎవరిదైనా నాలుకే కదా! మాట్లాడటం వస్తుంది కదా!” అన్నాడు డాక్టరు.

 

అలా ఎలా అవుతుంది? ముందునుండి నాకు ఎక్కువగా మాట్లాడటం అలవాటు లేదు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా ఎదో ఒకటి  ఎడతెరిపి లేకుండా మాట్లాడుతూనే ఉన్నానుఅని బాధపడ్డాడు సుబ్బారావు.

 

 

                 .చెప్పుకోండి చూద్దాం

 

తెలుగు అక్షరాలలో అనే అక్షరం  రెండు సార్లు వాడే పదం. ఇది పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు,ప్రేమికులు, కోపంగా కాని, నవ్వుతూ కాని వాడతారు.

 

ఏంటా పదం?

 

 

10 Responses to “పుణుకులు”

  1. ఖేఖ !!?

  2. ఒకటి ఖరాఖండిగా అంటే ఖచ్చితంగా. రెండవది ఖఖ =కట్టి =కటీఫ్ = నీతో మాట్లాడను. దోస్త్ కి ఆపోజిట్. ఏమంటారు. జ్యోతులూ. నేను కరెక్టేనా?

  3. ఖర్మ. .ఖర్మ.. . am I Correct?

  4. ఖఖా అంటే హిందీలో దోఖా అని. దో అంటే రెండు కదా. దోఖా అంటే మోసం.

  5. హిందీ మోసం ధోఖా అనుకుంటాగదా!?

  6. అవునండి. దోఖా అంటే హిందీలో మోసం.

  7. ఎంత తెలుగు తనం వుట్టి పడుతోంది..ఈ బ్లాగులలొ..
    మీ అందరికీ ధన్యవాదాలు..
    యడవల్లి శర్మ

  8. యడవల్లి వేంకట సత్యనారాయణ శర్మ

    మీరు కూడా ఇటువంటి బ్లాగు ఒకటి తేలిగ్గా మొదలెట్ట వచ్చు.

  9. అక్కాయ్.. ధోకా అంటే మోసం.. దోఖా అంటే కాదనుకుంటా..

  10. కాదు కృష్ణమోహన్

    దోఖా నే కరెక్ట్..

    दॊका కాదు दॊखा అర్ధమయిందా. నాకు హిందీ అంటే కూడా ఇష్టమే చిన్నప్పటినుండి.

Leave a Reply