గోదావరి…
రాసినది జ్యోతి పై అక్టోబర్ 30, 2007
నిన్న నా పాత పుస్తకాలు అన్ని సర్దుతూ ఉంటే పాతికేళ్ళ క్రింద ఒక వార పత్రిక నుండి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ పాట దొరికింది… నా బ్లాగులో పెట్టేసి దాచుకుంటూ మీ అందరితో పంచుకుంటున్నాను……
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
గోదావరీ దేవి గుండె జలజలలాడా
అదగొని మనసు కదలాడి … జాలి
పొదులో పెల్లగిలి పూడి … కిన్నెరా
గేదంగి తెల్ల రేకెత్తు క్రొత్తరగలలో
చాదుకొని పెనుతరంగ లూగే… ఆ వాగు
నాదుగొన యామెవగ సాగే
గోదావరి జాలి గుండె గూడులు కదలి
సాదు కిన్నెర కెదురుపోయీ.. ఆమె
లోదిగులు తరగ చేదోయీ… వారించి
అదరముచే నామె నదిమి గౌగిట బూని
ఏది నీ మొగము నా తల్లీ… అన్నదీ
నీ దిగులు నికమాను చెల్లీ
గోదావరి పేదగుండె లోతులు కలగి
రాదగ్గరకు రమ్ము తల్లీ … ఎంత
సాదువే నా ముద్దు చెల్లీ… నీ వెన్ని
రాదగని కష్టాల రాశి మ్రగ్గితినమ్మ
నీదు పతి శిలరూపు పొందీ .. నీవేమో
ఓదె వనవాగుగా చిందీ
గోదావరీ జాలిగుండె ప్రేగులు తడిసి
నీ దుఃఖమెంతదో తల్లి … నిన్ను
నాదరువుగా నమ్ము చెల్లి … నిను చూచి
పేదలై, లోకాలు పెద్దలై యేలేటి
జొదులే, మతి చెడిరి తల్లి …నీ యేడ్పు
రోదసిని నిండినది చెల్లీ
గోదావరీ యెడద కోసలను కోతపడి రా దగ్గరకు రమ్ము తల్లీ
జోదింక నిను కనడు చెల్లీ.. నా తల్లి
నాదు గర్భమున నిన్నాదుకుని ఉంటాను
నీదు నెగులును పోవచూడూ . కడలి
నీదు జోలికి నింక రాడూ
గోదావరీ దేవి కొస మనసులో వొరసి
ఏది నీ యొడలు నా తల్లీ … చేర్చు
నాదు కౌగింటిలో చెల్లీ …. తల్లి నీ
లే దలిరు కెరటాలు చెల్లీ .. తల్లి నీ
లే దలిరు కెరటాలు నాదు కాల్వల నింతు
నీదు బొట్టును కడలి కనడూ … నా తల్లి
నీదు సంగతి కడలి వినడూ
గోదావరీ మహా కూలంకషామృత
శ్రీదివ్య మధుతరంగాలూ.. చిన్న
సాదు కిన్నెర తరంగాలూ .. కలిసికొని
ప్రొదిగొను గంగా సరస్వతుల నీరములు
చాదుకొను తళుకు లురలించి .. చూడగా
సైదోడుతనము మెరిపించె…
విశ్వనాధ సత్యనారాయణ
కిన్నెరసాని పాటలనుండి….