పేద్ద తప్పు!!!!!!!!!

ఇంటర్‌నెట్ ఎక్స్‌ప్లోరర్ లోని బ్రౌజర్లో airtel అని టైప్ చేసి  Ctrl+Enter నొక్కండి. చూడండి తమాషా..

పుణుకులు…

 
1.
 
ఒకరోజు సుధాకర్ తన స్నేహితుడు కిరణ్ ఇంటికి వెళ్ళాడు. ఇద్దరు కలిసి టీ తాగుతూ పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నారు. చాలా సేపటినుండి సుధాకర్ గమనిస్తున్నాడు కిరణ్ ఇంట్లో ఒక ఎలుక
 పిల్లిని అన్ని గదులలో తరుముతుంది.
అది చూసి ఆశ్చర్యపోయి అడిగాడు.”ఏరా! సాధారణంగా పిల్లి ఎలుకను తరుముతుంది కదా?
మరి ఇదేంటి? మీ ఇంట్లో అంతా రివర్స్ గా ఉంది.” .
దానికి కిరణ్ నింపాదిగా సమాధానమిచ్చాడు.” ఏం లేదురా! పిల్లిని  నేను పెంచుకుంటున్నాను.
ఎలుకను మా ఆవిడ [...]

వివాహ మహోత్సవ శుభాకాంక్షలు….

                                       
కందర్ప కృష్ణమోహన్ దంపతులకు వివాహ మహోత్సవ శుభాకాంక్షలు..

తులసి

నటీనటులు: వెంకటేశ్, నయనతార, జయప్రకాశ్‌రెడ్డి,శివాజి,రమ్యకృష్ణ, ఆశిశ్ విద్యార్థి, సుబ్బరాజు, ఆలీ,విజయ్ కుమార్, మాస్టర్ అతులిత్.
దర్శకుడు: బోయపాటి సీను.
పండగ సీజన్‌లో  అన్నీ ఎంటర్‌టైనర్ సినిమాలు వస్తున్నాయి. తులసి సినిమా కూడా మంచి కమర్షియల్ మసాలా మూవీ - మంచి వినోదం, విదేశీ లోకేషన్లు మొదటి సగంలో, రెండో సగంలో మొత్తం ఫాక్షన్ కు సంబంధించిన యాక్షన్ సీనులు. ప్రేమించుకుందాం రా తర్వాత వెంకటేష్ చేసిన మరో మంచి ఫాక్షన్ సినిమా ఇది.
ఇందులో వెంకటేష్ బాగానే రాణించాడు అని చెప్పొచ్చు. [...]

తద్దినం - అవసరమా???

 
అందరికీ తెలిసిన విషయమే. చనిపోయిన పెద్దలకు మర్చిపోకుండా తద్దినం పెట్టాలి అని పెడుతున్నాం కూడా. కాని ఈ విషయంలో నాకు ఎన్నో సందేహాలు. చనిపోయినవారి స్మ్త్యత్యర్ధం అలా చేయడం మంచిదే. కాని మనం అది సక్రమంగా నిర్వహిస్తున్నామా. ప్రతి సంవత్సరం తద్దినం పెట్టకుంటే ఏమవుతుంది. ఎంతమంది మనస్పూర్తిగా చేస్తున్నారు. నిజంగా మన పెద్దలు సంతోషిస్తున్నారా? మేము చనిపోయాక కూడా మా పిల్లలు మమ్మల్ని గుర్తుంచుకున్నారు అని.
 
తద్దినం అంటే ఏమిటి? ఎందుకు చేయాలి?చేయకపోతే ఏమవుతుంది??
 
నేను గమనించినదేమంటే పెద్దవాళ్ళ [...]