కవితలు
గోదావరి…
నిన్న నా పాత పుస్తకాలు అన్ని సర్దుతూ ఉంటే పాతికేళ్ళ క్రింద ఒక వార పత్రిక నుండి నేను కట్ చేసి పెట్టుకున్న ఈ పాట దొరికింది… నా బ్లాగులో పెట్టేసి దాచుకుంటూ మీ అందరితో పంచుకుంటున్నాను……
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
గోదావరీ దేవి గుండె జలజలలాడా
అదగొని మనసు కదలాడి … జాలి
పొదులో పెల్లగిలి పూడి … కిన్నెరా
గేదంగి తెల్ల రేకెత్తు క్రొత్తరగలలో
చాదుకొని పెనుతరంగ లూగే… ఆ వాగు
నాదుగొన యామెవగ సాగే
గోదావరి జాలి గుండె గూడులు కదలి
సాదు కిన్నెర కెదురుపోయీ.. ఆమె
లోదిగులు [...]
అల్లరి
వై ఎస్ చేసేది ‘ వాగ్ధానాల ‘ అల్లరి
బాబు చేసేది ‘ విమర్శలా అల్లరి
కె సి ఆర్ చేసేది ‘ తెలంగాణ ‘ అల్లరి
క్రికెటర్లు చేసేది ‘ పరుగుల ‘ అల్లరి
దాక్టర్లు చేసేది ‘ కాసుల ‘ అల్లరి
లాయర్లు చేసేది ‘ కేసుల ‘ అల్లరి
కండక్టరు చేసేది ‘ చిల్లర ‘ అల్లరి
ప్రియుడు చేసేది ‘ వలపు ‘ అల్లరి
ప్రియురాలు చేసేది ‘ చిలిపి ‘ అల్లరి
సిన్మాలు చేసేది ‘ చిత్రమైన ‘ అల్లరి
విద్యార్తులు చేసేది [...]
మేరా డాలర్ $ మహాన్
ఆడ మగ పిల్లలందరు అమెరికాకు ఎగబడుతున్న ఈ సమయంలో వృద్ద తల్లిదండ్రుల మనోభావాలు
కంప్యూటర్ ఓ కంప్యూటర్ !
విడిపోతున్న బంధాలతో
వీడియో చాటింగులా ?
మమతతో స్పృశించాల్సిన వేళ్ళకు
మౌస్-కీ బోర్డులా?
కాటుక పెట్టాల్సిన కళ్ళకు
కాంటాక్టు లెన్సులా ?
పెసరట్టు దోశలను వదలి
పిజ్జా, ఫాస్త్ ఫుడ్సా ?
భావోద్వెగంతో నిండాల్సిన గుండెలకు
బ్రౌజింగ్ ఎంక్లేవులా?
ఒడిలో సేద తీరాల్సిన మాకు
ఓల్డేజి హోములా
కంప్యూటర్ ఓ కంప్యూటర్
నేటి కవిత
ట్యూబులైటు వెలుగు తెల్లగనుండు
కలర్ టీవీ చూస్తే హాయిగ నుండు
ఎయిర్ కండీషన్ చల్లగనుండు
గీజర్ నీరు వెచ్చగనుండు
బల్బులు చూడ వెలుగుచునుండు
కరెంటు బిల్లు చూస్తే
కళ్ళు తిరుగుచునుండు


